ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్ వస్తే జాగ్రత్తగా ఉండండి... కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!

By Ashok kumar SandraFirst Published Apr 1, 2024, 10:23 AM IST
Highlights

టెలికాం పరిశ్రమ పేరును ఉపయోగించుకుని ఈ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను బెదిరించి ఇంకా  వారి నంబర్‌లను డిస్‌కనెక్ట్ చేస్తామని చెప్పి  కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఈ నంబర్‌లను దుర్వినియోగం చేస్తున్నరు.
 

టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి వస్తున్న నకిలీ వాట్సాప్ కాల్స్ గురించి కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. టెలికాం పరిశ్రమ పేరుతో వస్తున్న ఈ కాల్స్ మొబైల్ వినియోగదారులకు ముప్పుగా మారాయి.

టెలికాం పరిశ్రమ పేరును ఉపయోగించుకునే ఈ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను బెదిరించి వారి నంబర్‌లను డిస్‌కనెక్ట్ చేస్తామని చెప్పి  కొన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వీరి  నంబర్‌లను దుర్వినియోగం చేస్తునారు.

దీనిపై టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ +92-xxxxxxxxx వంటి విదేశీ మొబైల్ నంబర్‌ల నుండి వచ్చే వాట్సాప్ కాల్‌లపై ప్రభుత్వ అధికారులుగా నటించి ప్రజలను మోసం చేస్తున్నారని  ఒక నోటిస్ కూడా జారీ చేసింది.

ఈ మోసగాళ్లు కాల్స్  ఉపయోగించి ప్రజలను బెదిరించి వారి వ్యక్తిగత సమాచారాన్ని పొంది ఆర్థిక మోసానికి పాల్పడుతున్నారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ తరపున ఇలాంటి కాల్స్ చేయడానికి ఎవరికీ అధికారం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది.

ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఎలాంటి సమాచారాన్ని షేర్ చేయవద్దని టెలికాం డిపార్ట్‌మెంట్ కూడా కోరింది.

ఇలాంటి మోసపూరిత కాల్‌లకు సంబంధించి సంచార్ సాథి ( www.sancharsaathi.gov.in ) వెబ్‌సైట్ ద్వారా   ఫిర్యాదులను దాఖలు చేయవచ్చని టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రజలకు సూచించింది.

మొబైల్ వినియోగదారులు సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు గురైనట్లయితే సహాయం కోసం సైబర్ క్రైమ్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 1920కి కాల్ చేయవచ్చు. లేదా మీరు www.cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు .

click me!