నీళ్లలో పడ్డ, కింద పడ్డ ఎం కాదు ! శాంసంగ్ నుండి లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్..

By Ashok kumar SandraFirst Published Mar 27, 2024, 1:33 PM IST
Highlights

శాంసంగ్ లేటెస్ట్ టెక్నాలజీతో ఏ55, ఏ35 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్  చేసింది. ఈ ఫోన్ నీటిలో పడినా,  నేలపై  పడిన  ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోన్ యధావిధిగా పని చేస్తుంది. ఏఐ కెమెరా, కొత్త ఫీచర్లతో పాటు పలు ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది. దీని ధర, ఇతర సమాచారం మీకోసం... 
 

బెంగళూరు: ఈ రోజుల్లో మొబైల్ మన  అంతర్భాగంగా మారింది. ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంటుంది. వాడుతున్నప్పుడు మొబైల్ ఒకోసారి  కింద  పడిపోవడం, నీళ్లలో పడే చూస్తుంటాం. అంతే కాదు మొబైల్ ఫోన్ కింద పడ్డాక  మళ్లీ పని చేసే అవకాశం తక్కువ. ఇకపై ఈ సమస్య ఉండదు. కారణం ఏంటంటే.. 30 నిమిషాల పాటు నీళ్లలో ఉన్న లేదా నేలపై పడ్డ పాడవని  స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ ఇప్పుడు లాంచ్  చేసింది. అవే  Samsung Galaxy A55 అండ్ A35 మొబైల్ ఫోన్స్.

శామ్సంగ్ బెంగళూరులో తాజాగా A55, A35 ఫోన్‌లను లాంచ్ చేసి దీని  అధునాతన ఫీచర్లు అలాగే  అప్ డేట్డ్  సేఫ్టీ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి సమాచారాన్ని అందించింది. కొత్త A సిరీస్ ఫోన్‌లు గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్, AI ఫీచర్ కెమెరా, ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ, శామ్‌సంగ్ నాక్స్ వాల్ట్ వంటి అనేక ముఖ్యమైన కొత్త ఫీచర్లు దీనిలో ఉన్నాయి. లాంచ్ ఈవెంట్‌లో ఫోన్‌ను అందరి ముందు నీటిలో ఉంచి పరీక్షించారు. అంతే కాదు, ఫోన్‌ను ఎత్తు నుంచి నేలపైకి వదిలి  పరీక్షించారు. ఈ రెండు పరీక్షల్లోనూ ఫోన్ ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు. 

ఈ సరికొత్త ఫోన్ ధర
Galaxy A55 5G    
8GB+128GB రూ. 36999
8GB+256GB రూ. 39999
12GB+256GB రూ. 42999

Galaxy A35 5G    
8GB+128GB రూ. 27999
8GB+256GB రూ. 30999

డిజైన్ అండ్  డూరబిలిటీ : మొదటి సారి Galaxy A55 5Gకి  సాంసంగ్  మెటల్ ఫ్రేమ్‌ అందించింది.  అలాగే  Galaxy A35 5G ప్రీమియం గ్లాస్‌ను తిరిగి పొందింది. Awesome Lilac, Awesome Ice Blue and Awesome Navy అనే మూడు ట్రెండి రంగులలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంది.  IP67 రేటింగ్‌, 1 మీటర్ మంచినీటి లోతులో  30 నిమిషాల వరకు ఉంచిన చెడిపోని  సామర్ధ్యం ఉంది. ఇంకా  డస్ట్  అండ్ సాండ్  రెసిస్టెంట్ తో  ఉంటాయి.

6.6-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు  బెజెల్స్‌తో చాలా రెస్పాన్సివ్ పర్ఫార్మెన్స్  అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ముందు ఇంకా వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్  డురాబిలిటీతో  ఉంటాయి.

సెక్యూరిటీ: సామ్‌సంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ ఫీచర్ మొదటిసారిగా A-సిరీస్‌లో అందించబడింది, ఇది వినియోగదారులకు   సెక్యూరిటీ అందిస్తుంది. హార్డ్‌వేర్ ఆధారిత సెక్యూరిటీ సిస్టం  హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ ఆటాక్స్  నుండి  రక్షణను అందిస్తుంది. పిన్ కోడ్‌లు, పాస్‌వర్డ్‌లు అలాగే ప్యాటర్న్ వంటి లాక్ స్క్రీన్   సహా డివైజెస్ అత్యంత ముఖ్యమైన డేటాను రక్షించడంలో సహాయపడుతుంది.

ఉన్నతమైన పనితీరు: 4nm ప్రాసెస్ టెక్నాలజీపై నిర్మించిన సరికొత్త Exynos 1480 ప్రాసెసర్ Galaxy A55 5Gకి   శక్తినిస్తుంది. Galaxy A35 5G 5nm ప్రాసెస్ టెక్నాలజీతో నిర్మించిన Exynos 1380 ప్రాసెసర్‌కి అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ హై-ఎండ్ ఫోన్‌లు   NPU, GPU అండ్  CPU అప్‌గ్రేడ్‌లతో పాటు 70%+ బిగ్  కూలింగ్ చాంబర్‌తో వస్తాయి. మీరు గేమింగ్ చేసినా లేదా మల్టీ టాస్కింగ్ చేసినా  అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది. 

click me!