ఇంటర్నేషనల్ పెమెట్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది. అయితే ప్రజల వినియోగానికి ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ తొందరలోనే భవిష్యత్తులో వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి రానుంది.
మెటా కంపెనీ త్వరలోనే ఇండియాలో వాట్సాప్‌లో విదేశాలకు డబ్బు పంపే సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
అయితే లక్షలాది మంది వినియోగదారులు సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. కంపెనీ ప్రస్తుతం భారతదేశంలోనే పేమెంట్ సౌకర్యాన్ని అందిస్తోంది. దింతో ఇప్పుడు విదేశాలకు డబ్బు పంపే సౌకర్యాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది.
undefined
వాట్సాప్ భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ పేమెంట్ సజావుగా చేయడంలో సహాయపడే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోందని సమాచారం. తాజాగా, “ఇంటర్నేషనల్ పేమెంట్స్” అనే ఈ ఫీచర్ గురించి సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
భారతదేశంలోని వాట్సాప్ వినియోగదారులు వారి బ్యాంకులు అంతర్జాతీయ UPI సేవను ప్రారంభించినట్లయితే మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త సౌకర్యం సెలెక్ట్ చేసిన అంతర్జాతీయ వ్యాపారులకు మాత్రమే ప్రత్యక్ష పేమెంట్స్ చేసేందుకు అనుమతిస్తుంది. దీనివల్ల ఆర్థిక లావాదేవీలు క్రమబద్ధీకరించడంతోపాటు కంప్లికేటెడ్ బ్యాంకింగ్ ప్రక్రియలను నివారించవచ్చని వాట్సాప్ భావిస్తోంది.
అంతర్జాతీయ చెల్లింపు సౌకర్యాన్ని పొందేందుకు వినియోగదారులు నిర్దిష్ట కాలపరిమితిని ఎంచుకోవాలి. వాట్సాప్ వినియోగదారులు ఈ వ్యవధిని మూడు నెలల వరకు పొడిగించుకోవచ్చని గమనించాలి.
అంతర్జాతీయ పేమెంట్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ లోనే ఉంది. ప్రజల వినియోగానికి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనికి సమీప భవిష్యత్తులో వాట్సాప్ బీటా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
International Payments on WhatsApp through UPI for Indian users.
This is currently not available for users. But WhatsApp might be working on it as I couldn't find anything on Google about it.
Apps like Phonepe, GPay and some others already support this. pic.twitter.com/OE2COo89eZ