ముఖ్యమైన విషయం ఏమిటంటే, IMEI నంబర్ ప్రతి మొబైల్ హ్యాండ్‌సెట్‌కు ఉంటుంది. ఐఎంఈఐ పోర్టల్‌లో రిజిస్టర్ ద్వారా మీ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేస్తే, దొంగిలించబడిన మీ మొబైల్ హ్యాండ్‌సెట్ ఏ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీతోనూ ఎటువంటి నెట్‌వర్క్ కవరేజీని అందించదు.
సాధారణంగా మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు లేదా రద్దీ ప్రదేశాలలో ఉన్నప్పుడూ ఎంతో కష్టపడి కొన్న స్మార్ట్ ఫోన్ చోరికి గురవుతుంటుంది. ఎవరికైనా స్మార్ట్ ఫోన్ పోతే ఎక్కువగా భాద కలిగించేది అందులో ఉన్న వ్యక్తిగత డేటా ఇంకా కాంటాక్ట్స్ మొదలైనవి. ఎన్నో వేలు పోసి స్మార్ట్ ఫోన్ కొంటుంటం. ఫోన్ పోయిన వెంటనే మీ దగ్గరలోని పోలీసు స్టేషన్ కి వెళ్ళి కంప్లెంట్ ఇస్తుంటం లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం. అంతే కాకుండా httpr://cybercrime.gov.inలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయవచ్చు.
సైబర్ క్రైమ్ ఫిర్యాదును రిజిస్టర్ చేయడానికి సంబంధిత కాల్ సెంటర్ నంబర్ 155260 ఇప్పుడు 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయచ్చు. లేదంటే భారతీయ టెలికాం డిపార్ట్‌మెంట్ httpr://ceir.gov.inలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్‌ను నేరుగా బ్లాక్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు. అయితే మీరు స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు బాక్స్ పైన ఉన్న ఐఎంఈఐ నంబర్ చాలా ముఖ్యం.
undefined
ముఖ్యమైన విషయం ఏమిటంటే, IMEI నంబర్ ప్రతి మొబైల్ హ్యాండ్‌సెట్‌కు ఉంటుంది. ఐఎంఈఐ పోర్టల్‌లో రిజిస్టర్ ద్వారా మీ మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేస్తే, దొంగిలించబడిన మీ మొబైల్ హ్యాండ్‌సెట్ ఏ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీతోనూ ఎటువంటి నెట్‌వర్క్ కవరేజీని అందించదు.
మరో విషయం ఏంటంటే కొందరు ఒకోసారి తక్కువ ధరకే మంచి ఫోన్ లభిస్తుందని సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటుంటారు. సెకండ్ హ్యాండ్ లేదా బాగు చేసిన ఫోన్ లను కొనుగోలు చేసే ముందు మీరు KYM ఫీచర్‌ని ఉపయోగించాలి. ఎందుకంటే ఈ మొబైల్ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నదా, నకిలీదా లేదా ఇప్పటికే వేరొకరు ఉపయోగిస్తున్నారా.. అనేది తెలుస్తుంది. మీరు కొనుగోలుచేసే ఫోన్ తప్పనిసరిగా ప్యాకేజింగ్ బాక్స్/ మొబైల్ బిల్లు/ఇన్ వాయిస్‌లో IMEI నంబర్ రాసి ఉండాలి. లేదంటే మీరు *#06# డయల్ చేయడం ద్వారా మీ మొబైల్ IMEI నంబర్‌ను చెక్ చేయవచ్చు.
మొబైల్ ఫోన్ అన్‌బ్లాక్
*మొబైల్ ఫోన్ బ్లాక్, అన్‌బ్లాక్, ప్రస్తుత స్టేటస్ కనుక్కోవడానికి
*httpr://ceir.gov.in/Qequert/CeirUrerUnblockQequertDirect.jrp
*ఆండ్రాయిడ్ ఫోన్‌లో డేటాను తొలగించడానికి..
*https://support.google.com/accounts/answer/6160491?hl=en
*Erase a device in Find My iPhone on iCloud.comలో పోయిన ఐఫోన్‌ను కనుక్కోవచ్చు, బ్లాక్ చేయవచ్చు.
*ఆండ్రాయిడ్ డివైజ్ కనుక్కోవడానికి httpr://www.google.com/android/find కి లాగిన్ అయ్యి, వివరాలన్నీ ఎంటర్ చేసి, మొబైల్‌లో డేటా తొలగించవచ్చు.
*ఆపిల్ డివైజ్ కనుక్కోవడానికి https://support.apple.com/en-in/guide/icloud/ mmfc0ef36f/icloud కి లాగిన్ అయ్యి, వివరాలన్నీ ఎంటర్ చేసి, డేటా తొలగించవచ్చు.