Flipkart Big Bachat Dhamaal Sale: మార్చి 4 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో భారీ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్లు..!

By team telugu  |  First Published Mar 3, 2022, 12:37 PM IST

ఫ్లిప్‌కార్ట్ నుంచి భారీ బంపర్ ఆఫర్. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్ అందుతోంది. కేవలం ఆఫర్లే అనుకుంటున్నారా.. నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 


ఫ్లిప్‌కార్ట్ నుంచి భారీ బంపర్ ఆఫర్. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యాక్సెసరీలపై భారీ డిస్కౌంట్ అందుతోంది. కేవలం ఆఫర్లే అనుకుంటున్నారా.. నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. మార్చి 4వ తేదీ (శుక్ర‌వారం) నుంచి ప్రారంభ‌మై మార్చి 6వ తేదీ వ‌ర‌కు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ థమాల్ సేల్ కొన‌సాగుతుంది. స్మార్ట్ ఫోన్లు, వేరెబుల్స్, టీవీలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. మోటోరోలా ఎడ్జ్ 30 ప్రో వంటి మోడల్స్ కూడా బిగ్‌సేల్ ధమాకాలో ఉన్నాయి. ఐఫోన్ 12 సిరీస్ మోడల్‌పై ఆకర్షణీయమైన ఆఫర్ ఉంది. అంతేకాదు వినియోగదారుల కోసం బ్యాంక్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఉంది. 

ఫ్లిప్‌కార్ట్ అధీకృత పేజ్‌పై ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం సమగ్రంగా ఉంది. బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, కాంబో ఆఫర్లు రోజు రాత్రి 12 గంటలు, ఉదయం 8 గంటలు, సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తుంది. అదే సమయంలో మద్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ లూట్ బజార్ పేరుతో అతి తక్కువ ధరలకు వస్తువులు లభించును. 

Latest Videos

డిస్కౌంట్లు, ఆఫర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం కూడా ఉంటుంది. స్మార్ట్ వాచెస్, టీవీలు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ కూడా వారాంతంలోగా చేరుతాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ సేల్‌లో యూపీఐ లావాదేవీలపై రూ. 1000 వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ అందించే భారీ డిస్కౌంట్లను సొంతం చేసుకోవాలంటే UPI లావాదేవీలపై రూ. 1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, Yes Bank క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై 10 శాతం instant discount పొందవచ్చు. No-cost EMI ప్లాన్‌లు, పాత స్మార్ట్‌ఫోన్‌ల exchange ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ అప్‌గ్రేడ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్‌ (Mobile Protection) ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. Realme C11 స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 7,499 ఉండగా.. Poco C31 ప్రారంభ ధర రూ. 7,999 నుంచి కొనుగోలు చేయొచ్చు. ఇవి కాకుండా నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్స్, ఎక్స్చేంజ్ సౌకర్యం వంటివి ఉన్నాయి. 

click me!