వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. హిందీని ఇప్పుడు Meta AIలో కూడా వాడొచ్చు..

By Ashok Kumar  |  First Published Jul 26, 2024, 6:16 PM IST

యుఎస్‌లో మెటా 'ఇమాజిన్ మీ'ని కూడా పరిచయం చేసింది, దీని ద్వారా AI రూపంలో మీ స్వంత లుక్ రూపొందించడానికి AI మీకు ఉపయోగపడుతుంది. 
 


న్యూయార్క్: Meta AI ఇప్పుడు హిందీలో కూడా వచ్చేసింది.దింతో  Meta AI సర్వీస్ మరో ఏడు దేశాలకు విస్తరించింది. Meta AI అర్జెంటీనా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, మెక్సికో, పెరూ, కామెరూన్‌కు చేరుకుంది. దీంతో 22 దేశాల్లో Meta AI అందుబాటులోకి రానుంది. WhatsApp, Instagram, Messenger, Facebookతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో Meta AIతో ఇప్పుడు హిందీలో చాట్ చేయవచ్చు. ఈ అనుభవాన్ని మెరుగుపరచడానికి, కొత్త ఫీచర్‌లను చేర్చడానికి ప్రతి రెండు వారాలకు Meta AI అప్‌డేట్ చేయబడుతుందని Meta తెలిపింది.

యుఎస్‌లో మెటా 'ఇమాజిన్ మీ'ని కూడా పరిచయం చేసింది,  దీని ద్వారా AI రూపంలో మీ స్వంత లుక్ రూపొందించడానికి AI మీకు ఉపయోగపడుతుంది.  కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు.  ఫోటోస్  ఎడిట్ చేయడానికి  'ఎడిట్ విత్ AI' ఫీచర్ కూడా వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నట్లు రిపోర్ట్స్  చెబుతున్నాయి.

Latest Videos

Meta AI చాట్‌బాట్ Meta స్వంత లామా AI ద్వారా ఆధారితమైనది. కొత్త Meta 405B వెర్షన్ కాంప్లెక్స్ మధ్య్స్ సమస్యలను కూడా పరిష్కరించగలదని మెటా తెలిపింది. క్వెస్ట్, మెటా  VR హెడ్‌సెట్‌లోని వాయిస్ కమాండ్‌లలో Meta AI చేర్చబడుతుందని కంపెనీ తెలిపింది.

click me!