కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు స్పందనగా అమెజాన్ తన ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో పెద్ద మార్పులు చేసింది
మొబైల్ యాప్స్ ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త అప్‌డేట్‌లను తీసుకొస్తుంటాయి. ఇందులో లేటెస్ట్ హోమ్ స్క్రీన్ అత్యంత ముఖ్యమైన ఫీచర్. ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌లో భారీ మార్పులు చేసింది. అమెజాన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూజర్లకు అతుకులు లేని స్ట్రీమింగ్, మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్ అందించడానికి కొత్త లుక్ అందించింది.
కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు స్పందనగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ పెద్ద మార్పులు చేసింది. వీటిలో ఒకటి హోమ్ స్క్రీన్ లుక్. హోమ్, సినిమాలు, టీవీ షోలు, లైవ్ టీవీ మెను అప్షన్స్ ఇక నావిగేషన్ బార్‌లో చూడవచ్చు. దీని వల్ల కస్టమర్‌లు ప్రతి కంటెంట్‌ను చూడడానికి ఈజీ చేస్తుంది. దీనితో, ఎక్కువ బ్రౌజింగ్ లేకుండా మీకు కావలసిన కంటెంట్ మీ ముందు ఉంటుందని అమెజాన్ పేర్కొంది.
undefined
మరోకటి అమెజాన్ బెడ్‌రాక్ ప్రోడక్ట్ AI (కృత్రిమ మేధస్సు) ఆధారిత సిస్టం, ఇది పర్సనలైజెడ్ రికమెండేషన్స్ పొందుతుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ కొత్త యానిమేషన్స్, పేజీ ట్రాన్స్ఫార్మేషన్స్, జూమ్ ఎఫెక్ట్ తో ఫేస్‌లిఫ్ట్ కూడా ఉంది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు అమెజాన్ ప్రైమ్ వీడియోను యూజర్లకు ఫీల్ గుడ్ చేస్తాయని ప్రైమ్ వీడియో వైస్ ప్రెసిడెంట్ కామ్ కాశ్మీరీ తెలిపారు.
పాత, కొత్త అన్ని రకాల డివైజెస్ లో ఈ కొత్త మార్పులు కనిపించనుంది. ఈ అప్‌డేట్ ఒక వారంలో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోకి అందుబాటులోకి రానుంది.