ఆపిల్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ట్యాగ్‌ని తీసుకొచ్చాయి. ఇప్పుడు జియో కూడా అలాంటి ట్యాగ్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాగ్ గురించి పూర్తి వివరాలు ఇదిగో..
పర్స్ ఇప్పుడే పక్కన పెట్టి మళ్ళీ మళ్ళీ వెతుకుతుంటాము. ఇలా మనం పదే పదే మరచిపోయే విషయాలను మిస్ కాకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ గాడ్జెట్ సహాయపడుతుంది.
ఆపిల్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ట్యాగ్‌ని తీసుకొచ్చాయి. ఇప్పుడు జియో కూడా అలాంటి ట్యాగ్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఈ ట్యాగ్ గురించి పూర్తి వివరాలు ఇదిగో..
వస్తువులను ఎక్కడ పెట్టామో మరచిపోయే వ్యక్తులకు ఈ ట్యాగ్ చాల ఉపయోగపడుతుంది. జియో ట్యాగ్ పేరుతో వస్తున్న ఈ గాడ్జెట్‌ను జియో లాంచ్ చేసింది. జియో ఈ ట్యాగ్‌ని బ్లూ, గ్రే & రెడ్ కలర్స్‌లో కోనవచ్చు.
ప్రస్తుతం ఈ జియో ట్యాగ్ జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే, జియోట్యాగ్ ఎయిర్ ధర రూ.1499.
ఈ ట్యాగ్ ఎలా పని చేస్తుంది?
ఆండ్రాయిడ్ యూజర్లు జియో థింగ్స్ యాప్ సహాయంతో ఈ డివైజ్ ఉపయోగించవచ్చు. అలాగే Apple యూజర్లు Find My Network యాప్ ద్వారా ఈ డివైజ్ ఉపయోగించవచ్చు.
ఈ ఫోన్ Android 9, iOS 14 ఇంకా అప్ డేట్ ఫోన్‌లలో బ్లూటూత్ 5.3తో పనిచేస్తుంది. ఇందులో ఇంటర్నల్ స్పీకర్ ఉంది. ఈ ఇంటర్నల్ స్పీకర్ 90-120 db పరిధిలో సౌండ్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ చిన్న డివైజ్ బరువు 10 గ్రాములు మాత్రమే. ఇందులోని బ్యాటరీ ఒక సంవత్సరం పాటు పని చేస్తుంది. మీ ఆబ్జెక్ట్ మొబైల్ పరిధి నుండి దూరం వెళితే మీకు వెంటనే హెచ్చరిక వస్తుంది.