ట్విట్టర్, మెటా, అమెజాన్ తరువాత ఇప్పుడు హెచ్‌పి.. వేలల్లో కొనసాగుతున్న ఉదోగాల తొలగింపు.. కారణం..?

By asianet news telugu  |  First Published Nov 23, 2022, 5:09 PM IST

తాజాగా టెక్ కంపెనీ సిస్కో కూడా 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ ట్విట్టర్ డీల్ పూర్తి చేసిన తర్వాత  వర్క్‌ఫోర్స్‌ను దాదాపు 50 శాతం తగ్గించారు.
 


ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు  ఆగడం లేదు. మెటా, అమెజాన్, ట్విట్టర్ తర్వాత ఇప్పుడు ప్రముఖ కంప్యూటర్-ల్యాప్‌టాప్ తయారీ సంస్థ హెచ్‌పి కూడా ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి  సంబంధించి కంపెనీ  6,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. అయితే కంపెనీ వచ్చే 3 సంవత్సరాలలో క్రమంగా ఈ  తొలగింపులు చేయనుంది. ఇంతకుముందు పెద్ద టెక్ కంపెనీ సిస్కో కూడా 4,000 మందికి పైగా ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. 

10 శాతం మంది ఉద్యోగుల  తొలగింపు
HPలో ప్రస్తుతం 61,000 మంది ఉద్యోగులు ఉన్నారు, అందులో 10 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని కంపెనీ యోచిస్తోంది. రానున్న మూడేళ్లలో దాదాపు 4,000 నుంచి 6,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ సేల్స్ నిరంతరం తగ్గడం, ఆర్థిక వ్యవస్థ ఆందోళనల కారణంగా ఈ తొలగింపులు జరుగుతున్నాయి.

Latest Videos

undefined

కంపెనీ కాస్ట్ కటింగ్ ప్లాన్‌లలో ఇది కూడా ఒకటి అని చెబుతున్నారు. HP నాల్గవ త్రైమాసిక ఆదాయం 11.2 శాతం క్షీణతను నమోదు చేసింది, అయితే గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ $14.8 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.  

టెక్ రంగంలో ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి?
 ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఆర్థిక మాంద్యం  దెబ్బకు భయపడుతున్నాయి. ఇంతకుముందు, కరోనా లాక్‌డౌన్ ఇంకా  వర్క్ ఫ్రమ్ హోమ్  కారణంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ విభాగంలో సేల్స్ విపరీతంగా పెరిగాయి, కానీ ఇప్పుడు ఈ మార్కెట్ తగ్గుతోంది.

 లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ వర్క్ కారణంగా, కంపెనీలు అవసరమైన దానికంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చాయి, ఇప్పుడు మార్కెట్ క్షీణిస్తున్నప్పుడు, బ్యాలెన్స్ క్రియేట్ చేయడానికి కంపెనీలు నిరంతరం తొలగింపులు చేస్తున్నాయి. 

ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్‌లలో కూడా తొలగింపులు
ఎలోన్ మస్క్ ట్విట్టర్ డీల్ పూర్తి చేసిన తర్వాత  వర్క్‌ఫోర్స్‌ను దాదాపు 50 శాతం తగ్గించారు. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఖర్చులను తగ్గించుకోవడానికి 11,000 మంది కార్మికులను తొలగించింది. దీని తరువాత పెరుగుతున్న ఆర్థిక మందగమనం మధ్య ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా  ఖర్చులను తగ్గించడం ప్రారంభించింది. నివేదిక ప్రకారం, అమెజాన్ నుండి 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నారు. తాజాగా సిస్కో 4,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది, అంటే దాని శ్రామిక శక్తిలో దాదాపు 5 శాతం. 

click me!