Google Pixel 6: అమెజాన్‌లో గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్ సేల్.. ధర ఎంతంటే..?

By team telugu  |  First Published Jun 5, 2022, 11:31 AM IST

పిక్సెల్ 6 సిరీస్ మొబైళ్లను గూగుల్ గత సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్ చేసింది. గూగుల్ పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్‌లను తీసుకొచ్చింది. కొన్ని దేశాల్లో ఈ మొబైళ్లను ప్రవేశపెట్టింది. సప్లై షార్టేజ్ కారణాలతో భారత్‌, చైనాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలు, మధ్య ఆసియా దేశాల్లో ఈ రెండు ఫోన్లను గూగుల్ విడుదల చేయలేదు. 
 


ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను రెండు వేరియంట్లలో ప్రకటించింది. అందులో గూగుల్ Pixel 6, Pixel 6 pro సిరీస్. ఇప్పటివరకూ గూగుల్ అధికారికంగా ఈ రెండింటిని అధికారికంగా లాంచ్ చేయలేదు. గత ఏడాదిలోనే ఈ రెండు పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రో ఫోన్లను గూగుల్ ఆవిష్కరించింది. అమెజాన్ ఇండియాలో ఈ పిక్సెల్ 6 సిరీస్ సేల్ మొదలైంది. పిక్సెల్ 6 ఫోన్లు అమెజాన్‌లో 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,444కి అందుబాటులో ఉంది. పిక్సెల్ 6ప్రో అమెజాన్‌లో 12GB, 128GB స్టోరేజ్ ధర రూ.71,700కి అందుబాటులో ఉంది.  12GB, 256GB వేరియంట్ ధర రూ.99,650కి విక్రయిస్తున్నారు.

ఈ రెండు ఫోన్‌లు సోర్టా సన్నీ, స్టార్మీ బ్లాక్‌తో సహా రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో Pixel 6 ఫోన్ (8GB, 128GB స్టోరేజ్ వేరియంట్) ప్రారంభ ధర 599 డాలర్లు (సుమారుగా రూ.45వేలు)తో అందుబాటులో ఉంది. 8GB RAMతో 256GB వేరియంట్ కూడా ఉంది. దీని ధర 699 డాలర్లు (సుమారు రూ. 52,500). Pixel 6 Pro మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో 128GB, 256GB, 512GB, 128GB వేరియంట్ ధర 899 డాలర్లు (సుమారు రూ. 67,500), 256GB వేరియంట్ ధర 999 డాలర్లు (సుమారు రూ. 75,000), 512GB వేరియంట్ ధర 1099 డాలర్లు (సుమారు రూ. 82,500)లకు అందుబాటులో ఉన్నాయి.

Latest Videos

భారత్, అమెరికాలో ఈ ఫోన్‌ల ధర ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉంది. Google ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. పిక్సెల్ 6, పిక్సెల్ 6 ప్రోలను కొనుగోలు చేయాలనుకుంటే కష్టమే. ఎందుకంటే Google భారత్‌లో అధికారికంగా ప్రకటించలేదు. మీరు నిజంగా గూగుల్ పిక్సెల్ డివైజ్ కొనుగోలు చేయాలంటే Pixel 6a స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూడక తప్పదు. త్వరలో భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని గూగుల్ వెల్లడించింది. జూలై నెలాఖరు నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. జూలై 21 నుంచి అమెరికా, జపాన్‌లలో ప్రీ-ఆర్డర్లకు Pixel 6a అందుబాటులో ఉంటుందని గూగుల్ ప్రకటించింది.

click me!