Google Faces Big shock: గూగుల్‌కు భారీ షాక్‌.. ఈ స్మార్ట్‌వాచ్‌లు మాకొద్దు బాబోయ్‌..!

By team telugu  |  First Published Mar 3, 2022, 3:14 PM IST

నేటి కాలంలో ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేందుకు స్మార్ట్‌వాచ్‌లు (Latest Smartwatch) సహాయపడతాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ పెరుగుతోంది. 


నేటి కాలంలో ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేందుకు స్మార్ట్‌వాచ్‌లు (Latest Smartwatch) సహాయపడతాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రస్తుతం సాధారణ వాచ్‌లకు బదులుగా స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో బడ్జెట్ వాచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్‌లో కొన్ని ప్రత్యేక స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. అందులో చెప్పుకోద‌గిన స్మార్ట్‌వాచ్ గూగుల్‌కు చెందిన ఫిట్‌బిట్‌ కంపెనీ. 

అయితే ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు యూఎస్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ సేఫ్టీ కమిషన్‌ భారీ షాకిచ్చింది. గూగుల్‌కు చెందిన స్మార్ట్‌ వాచ్‌లను రీకాల్‌ చేయాలని సూచించింది. దీంతో గూగుల్‌ స్మార్ట్‌ వాచ్‌లను రీకాల్‌ చేసేందుకు సిద్ధమైంది. అస‌లు ఏం జ‌రిగింది.. గూగుల్ ఎందుకు స్మార్ట్ వాచ్‌ల‌ను రీకాల్ చేసేందుకు సిద్ద‌మైందో ఇప్పుడు తెలుసుకుందాం..!

Latest Videos

గూగుల్‌కు చెందిన ఫిట్‌బిట్‌ కంపెనీ రూ.22,631 ధరతో ఐకానిక్‌ స్మార్ట్‌ వాచ్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌వాచ్‌ గూగుల్‌ కంపెనీది కావడంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్మార్ట్ వాచ్ ప్రేమికులు ఆ వాచ్‌ను కొనుగోలు చేశారు. కేవ‌లం ఒక్క అమెరికాలోనే 1 మిలియ‌న్ స్మార్ట్ వాచ్‌ల‌ను ఫిట్‌బిట్ కంపెనీ విక్ర‌యించింది. అమెరికాలో 1 మిలియన్ యూజ‌ర్లు ఈ స్మార్ట్‌ వాచ్‌లను కొనుగోలు చేశారు. అలాగే మిగిలిన దేశాల్లో 6, 93,000 వాచ్‌లను యూజర్లు కొనుగోలు చేశారు. ఫలితంగా స్మార్ట్‌ వాచ్‌లను వినియోగించిన యూజర్లకు ఆ స్మార్ట్ వాచ్ నుంచి భారీ షాక్ త‌గిలింది.

స్మార్ట్‌వాచ్ వాడుతున్న యూజ‌ర్ల‌ చేతులు కాలిపోవ‌డం, తీవ్రంగా గాయపడ‌టం జ‌రిగింది. స్మార్ట్‌ వాచ్‌లను ధరించడంతో వాచ్‌లో ఉండే బ్యాటరీ వేడెక్కి పేలడం, చేతులకు తీవ్రగాయాలు కావడంతో గూగుల్‌ కంపెనీపై ప‌లువురు యాజర్ల నుంచి యూఎస్ క‌న్జ్యూమ‌ర్ సేఫ్టీ క‌మిష‌న్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరుసగా యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై యూఎస్‌ కన్జ్యూమర్‌ సేఫ్టీ కమిషన్‌ సభ్యులు గూగుల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటి వరకు బిట్‌ఫిట్‌ కంపెనీ స్మార్ వాచ్‌ల‌పై 115 అమెరికన్‌ యూజర్లు, మిగిలిన దేశాల్లో 59మంది యూజర్లు ఫిర్యాదు చేసినట్లు క‌మిష‌న్ స‌భ్యులు తెలిపారు. 

అంతేకాదు.. యూజర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాసిరకం ఫిట్‌బిట్‌ కు చెందిన 10 మిలియన్‌ల​ వాచ్‌లను వెంటనే రీకాల్‌ చేయాలని గూగుల్‌ను క‌మిష‌న్‌ హెచ్చరింది. దీంతో కన్జ్యూమర్‌ సేఫ్టీ కమిషన్‌ హెచ్చరికలతో షాక్‌కు గురైన‌ గూగుల్‌ ఆ వాచ్‌లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే స్మార్ట్ వాచ్‌లు ఇలా కాలిపోవ‌డానికి గ‌ల కార‌ణాలు, ఇత‌ర సాంకేతిక లోపాలను గూగుల్ సంస్థ త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు యూజ‌ర్లు కోరుతున్నారు. వేల‌కు వేలు పెట్టి స్మార్ట్ వాచ్‌లు కొనుగోలు చేసి అవి ధ‌రించి తీవ్రంగా గాయ‌ప‌డ‌టం కొంత ఆందోళ‌న క‌లిగిస్తుంద‌ని యూజ‌ర్లు తమ అభిప్రాయాల‌ను తెలిపారు. ఇక‌నైనా టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ ఇలాంటి త‌ప్పులు చేయ‌కుండా నాణ్య‌మైన గ్యాడ్జెట్స్‌ను విడుద‌ల చేయాల‌ని యూజ‌ర్లు కోరుతున్నారు.

click me!