మీ ఐఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే ఈ విధంగా ఎక్కడుందో తెలుసుకోండి..

By S Ashok KumarFirst Published Apr 19, 2021, 1:13 PM IST
Highlights

ఇప్పటి వరకు ఆపిల్ వినియోగదారులు  పోగొట్టుకున్న ఐఫోన్‌ కోసం ఫైండ్ మై డివైజ్ సహాయంతో కనుగొంటుంటారు.  కానీ ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ సహాయంతో, కూడా ఐఫోన్‌  ఎక్కడుందో సెర్చ్ చేయవచ్చు.

సాధారణంగా మీ స్మార్ట్ ఫోన్ ని ఒకోసారి ఎక్కడైనా పెట్టి మర్చిపోతుంటారు లేదా ప్రయాణించేటప్పుడు చోరికి గురికావొచ్చు, మరెక్కడైనా పడిపోవచ్చు. ఎన్నో వేలు పెట్టి ఖార్చు చేసి స్మార్ట్ ఫోన్స్ కొంటుంటారు. అలాంటిది అనుకోని సందర్భాల్లో మీ స్మార్ట్ కనిపించకుండా పోతే చాలా  ఆందోళన గురిచేస్తుంది.

ఇప్పటివరకు పోగొట్టుకున్న ఐఫోన్‌ను  ఎక్కడుందో తెలుసుకోవడానికి ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ ఉపయోగిస్తుంటారు, కానీ ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ సహాయంతో, కూడా ఐఫోన్‌  ఎక్కడుందో సెర్చ్ చేయవచ్చు. గూగుల్  అసిస్టెంట్ కోసం తాజాగా ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేశారు. ఈ ఫీచర్ ద్వారా మీరు పోగొట్టుకున్న ఐఫోన్‌ను  కనుగొనవచ్చు.

ఎక్కువగా ఐఫోన్ వినియోగదారులు  ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ ఉపయోగిస్తుంటారు. ఆపిల్  ఐఫోన్‌ సిరి సహాయంతో  కూడా  ఆపిల్ ఐఫోన్ ని గుర్తించవచ్చు అలాగే రింగ్ కూడా చేయవచ్చు. ఇప్పుడు ఈ ఫీచర్ ని గూగుల్ అసిస్టెంట్‌లో కూడా తీసుకురాబోతున్నారు.

also read స్టాక్ మార్కెట్ పై కరోనా కల్లోలం.. సెన్సెక్స్ 1427 పాయింట్లు డౌన్... ...

గూగుల్ అసిస్టెంట్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ లిలియన్ రింకన్ ఈ కొత్త ఫీచర్ గురించి  ఒక బ్లాగులో సమాచారం ఇచ్చారు. మీ  స్మార్ట్ స్పీకర్, స్మార్ట్ డిస్ ప్లేతో "హే గూగుల్, ఫైండ్ మై  ఫోన్' చెప్పడంతో మీ ఫోన్ ని కనుగొనడంలో సహాయపడుతుంది.

మీరు ఈ నోటిఫికేషన్‌ను ఆన్ చేసిన తర్వాత ఫోన్ రింగ్‌టోన్ తో గూగుల్ హోమ్ యాప్ మీకు సమాచారం ఇస్తుంది. ఫోన్ సైలెంట్ లో ఉన్న  లేదా డు నాట్ డిస్టర్బ్  ఫీచర్ ఆన్ చేసిన కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది.

గూగుల్ అసిస్టెంట్ సహాయంతో వినియోగదారులు వారి ఐఫోన్‌ని ఎక్కడున్న కూడా రింగ్ చేయవచ్చు. ఫైండ్ మై డివైజ్  లాగానే గూగుల్ అసిస్టెంట్ కూడా మ్యాప్‌ను చూపుతుంది. గూగుల్ అసిస్టెంట్  ఈ ఫీచర్ అన్ని డివైజెస్ స్మార్ట్ స్పీకర్లు, క్రోమ్‌కాస్ట్, ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ట్యాబ్‌లలో పని చేస్తుంది.

click me!