ఫ్లిప్‌కార్ట్ కార్నివల్ సేల్: ఈ 8 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు.. కొద్దిరోజులే అవకాశం..

By S Ashok Kumar  |  First Published Apr 17, 2021, 5:26 PM IST

స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నవారి కోసం ఫ్లిప్‌కార్ట్‌ కార్నివాల్ సెల్  ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ లో భాగంగా వివిధ స్మార్ట్ ఫోన్ల పై డిస్కౌంట్స్ తో పాటు క్యాష్ బ్యాక్ కూడా అందిస్తుంది.
 


కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. లేదా  బెస్ట్ ఆఫర్  కోసం ఎదురుచూస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే. స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సెల్ ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సెల్ ఏప్రిల్ 20తో ముగుస్తుంది.

ఈ సేల్ లో రియల్‌మే సి12, మోటో జి10 పవర్, రియల్‌మీ నార్జో 30ఎ, ఐఫోన్ ఎక్స్‌ఆర్ వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు అందిస్తుంది. క్యాష్ బ్యాక్ తో పాటు మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లేదా హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో  కొనుగోలు చేస్తే మీకు రూ.750  వరకు అదనపు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఎం‌ఐ10 టి, ఐఫోన్ 12 ప్రో మాక్స్ వంటి ఫోన్ లకు కూడా వర్తిస్తుంది.

Latest Videos

మోటో జి10 పవర్
మోటో జి 10 పవర్‌ను ఇప్పుడు రూ .9,499కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ .9,999.

పోకో ఎం3
పోకో ఎం3ని  రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు కొనుగోలు చేస్తే  రూ .500 తగ్గింపు కూడా లభిస్తుంది.

రియల్‌మీ సి12 
రియల్‌మీ సి12  అసలు ధర రూ .8,999, కానీ ఇప్పుడు ఆఫర్ సేల్ ధర రూ .7,999.

also read 

ఐఫోన్ 12 ప్రో మాక్స్
ఐఫోన్ 12 ప్రో మాక్స్ రూ .1,22,900కు అమ్ముడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో  ఈ ఫోన్‌పై  రూ .5 వేల తగ్గింపును పొందువచ్చు.

ఆపిల్ ఐఫోన్ 11
ఐఫోన్ 11ని రూ .44,999కు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ .54,900.

షియోమి ఎం‌ఐ 10టి
ఈ ఫోన్‌ను రూ .34,999 ధరతో లాంచ్ చేశారు, కానీ ఇప్పుడు దీనిని రూ .32,999కు విక్రయిస్తున్నారు.

రియల్‌మీ 7
రియల్‌మీ 7ను రూ .1,500 డిస్కౌంట్‌తో 13,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

ఐక్యూ 3
ఐక్యూ 3ను 24,990 రూపాయలకు విక్రయిస్తుండగా,  దీని అసలు ధర రూ.36,990. ఈ ధర వద్ద మీకు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది.

రియల్‌మీ నార్జో 30ఎ
రియల్‌మీ నార్జో 30ఎని రూ .8,99 కు బదులుగా ఇప్పుడు మీరు  రూ .8,499కే కొనుగోలు చేయవచ్చు.
 

click me!