Flipkart sale: అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 13.. ఆఫర్ ఇదే..

Ashok Kumar   | Asianet News
Published : May 03, 2022, 01:03 PM IST
Flipkart sale: అత్యంత తక్కువ ధరకే  ఐఫోన్ 13..  ఆఫర్ ఇదే..

సారాంశం

ఐఫోన్ 13తో గరిష్టంగా 512 జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. ఐఫోన్ 13 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది.  

మీకు కూడా ఐఫోన్ అంటే ఇష్టమా.. ఏదైనా ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్  ఈరోజు నుండి అంటే మే 3 నుండి ప్రారంభమైంది, ఇక్కడ మీరు ఐఫోన్ 13ని అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. ఐఫోన్ 13ని ఇండియాలో రూ.79,900 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. ఈ ధర  128జి‌బి స్టోరేజ్ ఉన్న మోడల్‌కు మాత్రమే, కానీ ఇప్పుడు అదే మోడల్ కేవలం రూ.53,900కే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ గురించి తెలుసుకుందాం...

ఐఫోన్ 13పై రూ. 21,000పైగా తగ్గింపు
ఐఫోన్ 13 128జి‌బి మోడల్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,900కి లిస్ట్ చేయబడింది. మీరు ఫ్లిప్‌కార్ట్ క్లబ్‌లో సభ్యులు అయితే, మీకు 5% తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీకు మంచి ఐఫోన్ ఫోన్ ఉంటే రూ. 16,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఐఫోన్ 12 ఉన్నవారు iPhone 13 కొనుగోళ్లపై 16,000 రూపాయల తగ్గింపును పొందవచ్చు. మీకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ ఉంటే  అదనంగా రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా మొత్తంగా ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ. 53,900 అవుతుంది.

ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 13 6 కోర్ CPUతో A15 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇంకా ఇందులో 16 కోర్ న్యూరల్ ఇంజన్ ఉంది. ర్యామ్, బ్యాటరీ గురించి ఆపిల్ ఎప్పుడూ అధికారిక సమాచారం ఇవ్వదు. iPhone 13తో గరిష్టంగా 512జి‌బి స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 13 1000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లే ఉంది.

ఐఫోన్ 13లో 12-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈసారి కొత్త వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు, దీని ఎపర్చరు f/1.6. దీనితో సెన్సార్ ఆప్టికల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. నైట్ మోడ్ గతం కంటే మెరుగ్గా చేయబడింది. రెండవ లెన్స్ కూడా 12 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్,  దీని ఎపర్చరు f/2.4.

PREV
click me!

Recommended Stories

Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే