రియల్ మీ పాడ్ మినీ ఫస్ట్ సేల్.. రూ. 2వేల తగ్గింపుతో తక్కువ ధరకే..

By asianet news telugu  |  First Published May 2, 2022, 4:49 PM IST

ఈ ట్యాబ్ లో గ్రాఫిక్స్ కోసం Mali-G57 MP1 GPUతో Unisoc T616 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 64జి‌బి వరకు స్టోరేజ్‌తో 4జి‌బి వరకు ర్యామ్  అందించారు.


రియల్ మీ (Realme) ఇండియాలో రియల్ మీ పాడ్ మినీ (Realme Pad Mini)ని గత వారం లాంచ్ చేసింది. రియల్ మీ పాడ్ మిని భారతదేశంలో రియల్ మీ బడ్స్  Q2s, రియల్ మీ జి‌టి నియో 3, రియల్ మీ స్మార్ట్ టి‌వి ఎక్స్  ఎఫ్‌హెచ్‌డితో పాటు తీసుకొచ్చారు. రియల్ మీ ప్యాడ్ మినీ అనేది కంపెనీ చౌకైన ఆండ్రాయిడ్ ట్యాబ్. దీనిలో స్టీరియో స్పీకర్ ఉంది. 8.7 అంగుళాల డిస్ ప్లే, Dolby Atmos ఆడియోతో పరిచయం చేసారు. ఈ రోజు ఈ ట్యాబ్‌ మొదటి సెల్ ప్రారంభమైంది దీని ధర, లాంచ్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం....

 ఫస్ట్ సేల్ ధర
రియల్ మీ పాడ్ మినీ  Wi-Fiతో 3 జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్ ధర రూ. 10,999, 64జి‌బి స్టోరేజ్ అండ్ 4 జి‌బి ర్యామ్ ఊన్న Wi-Fi వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. 3జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్  Tab LTE వేరియంట్ ధర రూ. 12,999, LTEతో 4జి‌బి ర్యామ్ 64 జి‌బి మోడల్ ధర రూ. 14,999. Realme Pad Miniని నేటి  నుండి బ్లూ అండ్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. నేటి నుంచి మే 9 వరకు ఈ ట్యాబ్‌పై రూ.2,000 తగ్గింపు ఉంటుంది.

Latest Videos

Realme Pad Miniలో Android 11 ఆధారిత Realme UI ఉంది. దీనితో పాటు 8.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ట్యాబ్ గ్రాఫిక్స్ కోసం Mali-G57 MP1 GPUతో Unisoc T616 ఆక్టా-కోర్ ప్రాసెసర్, గరిష్టంగా 64జి‌బి స్టోరేజ్ తో 4జి‌బి  వరకు ర్యామ్ అందించారు. రియల్ మీ  ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

కనెక్టివిటీ కోసం, Realme Pad Mini Wi-Fi, బ్లూటూత్ v5.0, USB టైప్-సి పోర్ట్‌తో 4జి సపోర్ట్ ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇచ్చారు. ట్యాబ్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 6400mAh బ్యాటరీ ఉంది.

click me!