రేపే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్.. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్..

Published : Aug 25, 2022, 12:15 PM IST
రేపే ఫ్లిప్‌కార్ట్  బిగ్ బచత్ ధమాల్ సేల్..  మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్..

సారాంశం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ సేల్‌లో ఫ్యాషన్, గ్రూమింగ్, ఫర్నిచర్, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తో పాటు 80 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. 

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్ బిగ్ బచత్ ధమాల్‌ను ప్రకటించింది. ఈ మూడు రోజుల సేల్ ఆగస్టు 26 నుంచి ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో ధమాల్ డీల్స్, లూట్ బజార్, కాంబో డీల్స్ కింద ఎన్నో ఆఫర్‌లు ఉన్నాయి. ఈ సేల్‌లో ఫ్యాషన్, గ్రూమింగ్, ఫర్నిచర్, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ తో పాటు 80 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం...

స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో అన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఈ సేల్‌లో మీరు ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రారంభ ధర రూ. 15,999 దీనిని  రూ.9,749కి కొనుగోలు చేయవచ్చు. 6 జీబీ ర్యామ్‌తో కూడిన ఈ ఫోన్‌లో 128 స్టోరేజ్ ఉంది. బడ్జెట్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్లయితే ఈ సేల్ లో 5G ఫోన్‌ Moto G71 ప్రారంభ ధర రూ. 22,999 దీనిని రూ.15,249కి కొనుగోలు చేయవచ్చు. 

ఇంకా ఈ సేల్‌లో Vivo, Oppo, Realme, Poco, Samsungతో పాటు దాదాపు అన్ని బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్స్ పై భారీ తగ్గింపును పొందబోతున్నాయి.  మిడ్ రేంజ్ ఫోన్‌ల గురించి మాట్లాడినట్లయితే రియల్‌మీ 9 ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ. 27,999 దీనిని రూ. 22,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ కూడా లభిస్తుంది. అయితే రూ.22,499 ధరలో బెస్ట్ కెమెరా ఉన్న ఫోన్ ఇదే. 

ఎలక్ట్రానిక్స్ & అక్సెసోరిస్ 
బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో మీరు ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, కెమెరాలు, ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ రూటర్లు, స్టోరేజ్ డివైజ్‌లతో పాటు మానిటర్లు ఇంకా మొబైల్ ఆక్సెసరీలను 80 శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మొబైల్ బ్యాక్ కవర్‌ను రూ.99 ప్రారంభ ధరతో ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. సేల్‌లో బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను రూ. 799 ప్రారంభ ధరతో ఇంకా హెడ్‌ఫోన్‌లను 70 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 
 

PREV
click me!

Recommended Stories

Kitchen Gadgets: ఇంకా.. ఇవే పాత కాలం ప‌ట్క‌ర్ల‌ను వాడుతున్నారా.? అప్డేట్ అవ్వండి బ్రో
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలు సగం ధరకే.. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు