12,000mAh బిగ్ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.. కెమెరా, ఫీచర్లు కూడా అదుర్స్..

By asianet news teluguFirst Published Aug 23, 2022, 5:50 PM IST
Highlights

డూగీ నుండి వస్తున్న డూగీ S89, డూగీ S89 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు రెండూ బ్లాక్ ఇంకా ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. డూగీ S89ని 8జి‌బి ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్‌ ధర $309.99 అంటే రూ. 24,800కి కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ డూగీ (Doogee) ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్  లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద డూగీ S89 అండ్ S89 ప్రోని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 12,000mAh బ్యాటరీతో వస్తున్నాయి. మీడియాటెక్ హీలియో పి90 ఇంకా ఆండ్రాయిడ్ 12తో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం...

డూగీ S89, డూగీ S89ప్రొ ధర
డూగీ నుండి వస్తున్న డూగీ S89, డూగీ S89 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు రెండూ బ్లాక్ ఇంకా ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. డూగీ S89ని 8జి‌బి ర్యామ్, 128 జి‌బి స్టోరేజ్‌ ధర $309.99 అంటే రూ. 24,800కి కొనుగోలు చేయవచ్చు. డూగీ S89 ప్రో ధర $359.99 అంటే రూ. 28,800. రెండు స్మార్ట్‌ఫోన్‌లను అలీ ఎక్స్ ప్రేస్ ఇంకా డూగీ మాల్ వెబ్‌సైట్‌ల నుండి ప్రీ ఆర్డర్ చేయవచ్చు. కంపెనీ ప్రకారం, ఆగస్ట్ 28 నుండి డూగీ S89, ఆగస్ట్ 25 నుండి డూగీ S89 ప్రోని కొనుగోలు చేయవచ్చు. 

డూగీ S89 ఫీచర్లు 
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12తో పరిచయం చేసారు, 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌, 8 GB LPDDR4X ర్యామ్, MediaTek Helio P90 ప్రాసెసర్‌తో 128జి‌బి స్టోరేజ్, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, వీటిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 20 మెగాపిక్సెల్ సోనీ IMX350 నైట్ విజన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ ఉంది. ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. డూగీ S89 12,000mAh బ్యాటరీ, 33W వైర్డు ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ బరువు 400 గ్రాములు. 

డూగీ S89 ప్రో స్పెసిఫికేషన్‌లు
డూగీ S89 ప్రో ఆండ్రాయిడ్ 12తో పరిచయం చేసారు, 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌,  MediaTek Helio P90 ప్రాసెసర్, 8జి‌బి LPDDR4X ర్యామ్ 256జి‌బి స్టోరేజ్, కెమెరా సెగ్మెంట్ గురించి మాట్లాడితే  AI ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది, దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 20 మెగాపిక్సెల్ సోనీ IMX350 నైట్ విజన్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 12,000mAh బ్యాటరీ, ఇతర కనెక్టివిటీలో NFC, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB టైప్-సి పోర్ట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బరువు 400 గ్రాములు. 

click me!