Facebook Search History:ఫేస్‌బుక్ లో మీరు సెర్చ్ చేసిన వారి గురించి ఈ విధంగా డిలీట్ చేయవచ్చు..

By asianet news telugu  |  First Published May 7, 2022, 6:50 PM IST

ఈ ప్లాట్‌ఫారమ్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి, వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని అందించడానికి Facebook ఎప్పటికప్పుడు ఎన్నో ప్రత్యేక ఫీచర్‌లతో వస్తూనే ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీరు మీ స్నేహితులు, పరిచయస్తులతో కనెక్ట్ కావచ్చు. 


ఫేస్‌బుక్  వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ సమాజాన్ని వర్చువల్ రంగులో చిత్రించడానికి పనిచేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు Facebookని ఉపయోగిస్తున్నారు. ఫేస్‌బుక్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైందని చెప్పడం తప్పు కాదు. ఈ ప్లాట్‌ఫారమ్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చడానికి, వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని అందించడానికి Facebook ఎప్పటికప్పుడు ఎన్నో ప్రత్యేక ఫీచర్‌లతో వస్తూనే ఉంది.

ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీరు మీ స్నేహితులు, పరిచయస్తులతో కనెక్ట్ కావచ్చు. మనం ఫేస్‌బుక్‌లో ఏది సెర్చ్ చేసినా దాని మొత్తం డేటా ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్టోర్ చేయబడుతుంది. అయితే  మీకు Facebookలో మీ సెర్చ్ హిస్టరీని డిలెట్ చేసే ప్రక్రియ గురించి తెలుసా.. ఈ ప్రక్రియ చాలా సులభం. ఇందులో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. 

Latest Videos

undefined

సెర్చ్ హిస్టరీని తొలగించడానికి ముందుగా మీరు మీ Facebook యాప్‌ని తెరవాలి. ఆ తర్వాత మీరు సెర్చ్ గుర్తుపై క్లిక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

రీసెంట్ సెర్చ్ పక్కన ఎడిట్ బటన్ చూస్తారు. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత, మీ యాక్టివిటీ లాగ్ ఓపెన్ అవుతుంది.  ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లియర్ సెర్చ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు క్లియర్ సెర్చ్ అనే ఆప్షన్‌ను ఎంచుకున్న వెంటనే ఫేస్‌బుక్ నుండి మీ సెర్చ్ హిస్టరీ పూర్తిగా తొలగించబడుతుంది.

మీరు Facebook.comలో మీ సెర్చ్ హిస్టరీని తొలగించాలనుకుంటే. దీని కోసం మీరు బ్రౌజర్‌లో మీ ఫేస్‌బుక్ అక్కౌంట్ కి లాగిన్ అవ్వాలి.

లాగిన్ అయిన తర్వాత, మీరు పైన కుడి మూలలో డ్రాప్ డౌన్ బాణం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్‌లు అండ్ ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోవాలి. దీని తర్వాత మీరు యాక్టివిటీ లాగ్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఇక్కడ మీరు లాగ్  అక్షన్స్ అండ్ అదర్ అక్షన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీకు సెర్చ్ హిస్టరీ అనే ఆప్షన్ వస్తుంది. తరువాత మీరు క్లియర్ సెర్చ్ చేయడం ద్వారా మీ సెర్చ్ హిస్టరీ పూర్తిగా డిలెట్ చేయవచ్చు.
 

click me!