Latest Videos

ఇప్పుడు ఎ సైట్ ఓపెన్ చేసిన, ఎం చుసిన తెలిసిపోతుంది.. మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌డేట్‌..

By Ashok kumar SandraFirst Published May 24, 2024, 11:20 AM IST
Highlights

కొత్త సిస్టమ్ ద్వారా వందల వేల మంది కస్టమర్లను ప్రభావితం చేయగలదని మైక్రోసాఫ్ట్ అంచనా వేసింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ ఇక నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. 

మైక్రోసాఫ్ట్ పర్సనల్ కంప్యూటింగ్ రంగంలో పెద్ద మార్పులను ప్రారంభించింది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్  కొత్త ఏఐ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పర్సనల్  కంప్యూటర్‌లో   ఒకరి అన్ని ఆక్టివిటిస్  గుర్తుంచుకోగల, తిరిగి పొందగల సిస్టం ఒక  ప్రారంభం. మైక్రోసాఫ్ట్ బిల్డ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఈ కొత్త ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్  సిస్టంను ప్రవేశపెట్టారు. 

కొత్త సిస్టమ్ ద్వారా వందల వేల మంది కస్టమర్లను ప్రభావితం చేయగలదని మైక్రోసాఫ్ట్ అంచనా వేసింది. ఈ కొత్త ఏఐ ఫీచర్ ఇక నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. విండోస్ రీకాల్ అనే సిస్టమ్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కంప్యూటర్‌లో చేసిన మీ అన్ని పనులను గుర్తుంచుకుంటుంది. AI సహాయంతో కంప్యూటర్‌లో స్టోర్  చేయబడిన నిరంతరం  ట్రాక్ చేసే  స్క్రీన్‌షాట్‌లను విశ్లేషించడం ద్వారా ఇది పని చేస్తుంది. 

ఈ సిస్టం ఒక వ్యక్తి  ఉపయోగించే యాప్స్, ఓపెన్ చేసిన వెబ్‌సైట్‌లు, చూసిన షార్ట్ ఫిల్మ్‌లు మొదలైన అన్ని పనులను లాగ్ చేసే టూల్స్. యూజర్ల గోప్యతను పూర్తిగా పరిరక్షించడం ద్వారా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. యూజర్లు  ఏదైనా ఆక్టివిటీ  ట్రాక్ చేయాలనుకుంటే, కొత్త AI సిస్టమ్‌లో  సదుపాయం ఉంటుందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
 

click me!