Latest Videos

రీఛార్జ్ ధరలు పెంచినా 'జియో'నే బెస్ట్.. ఎందుకో తెలుసా?

By Ashok KumarFirst Published Jul 2, 2024, 6:27 PM IST
Highlights

జియోతో పాటు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచిన విషయం తెలిసిందే. అయితే వీటి పెంపు తర్వాత కూడా జియో ప్లాన్ల ధరలు ఇతర టెలికాం కంపెనీల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుండటం విశేషం. 

ఈ నెల ప్రారంభం నుంచి టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచుతూ యూజర్లకు షాక్ ఇస్తున్నాయి. ఈ విషయంలో గతవారం నుంచి రిలయన్స్ జియో 10 నుంచి 21 శాతం వరకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. ఆ తర్వాత ఎయిర్ టెల్ కూడా 25 శాతం వరకు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచడంతో వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. ఈ రేట్లు జూలై మూడో తేదీ నుంచి అంటే రేపటి  నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఛార్జీలు పెంచిన తర్వాత కూడా జియో యూజర్లకు బెస్ట్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇతర కంపెనీల రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే జియో రీఛార్జ్ ధరలు లభిస్తున్నాయి. ఉదాహరణకు జియో రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్  ప్లాన్ ధర రూ. 249 గా ఉంది. అదే ఎయిర్ టెల్ లో అయితే రూ. 299గా ఉంది. జియో యూజర్లు ఇప్పటికీ 20 శాతం తక్కువ ధరకే ఈ ప్లాన్ పై రూ. 50 ఆదా చేసుకోవచ్చు.

ఇలా పలు రీఛార్జ్ ప్లాన్ల విషయంలో జియో యూజర్లకు బెస్ట్ గా ఉంది. వాటిలో..

  • రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియోలో రూ. 299గా ఉంది. ఇదే రీఛార్జ్ ప్లాన్ ఎయిర్ టెల్ లో రూ. 349గా ఉంది. అంటే జియో యూజర్లు 17 శాతం తక్కువ ధరకే  ఈ ప్లాన్ పై రూ. 50 ఆదా చేసుకోవచ్చు.
  • రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియోలో రూ. 349కి అందిస్తుండగా, ఎయిర్ టెల్ లో ఇదే ప్లాన్ ధర రూ. 379గా ఉంది. జియో యూజర్లు 9 శాతం తక్కువ ధరకే ఈ ప్లాన్ తో రూ. 30 ఆదా చేసుకోవచ్చు.
  • మూడు నెలల ప్లాన్ల విషయానికి వస్తే.. 6 జీబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ మూడు నెలల ప్లాన్ ధర జియోలో రూ. 479గా ఉంది. అదే ఎయిర్ టెల్ లో రూ.509 గా ఉంది. అంటే ఈ ప్లాన్ కూడా జియోలోనే తక్కువ ధరకు లభిస్తోంది. 
  • రోజుకు 1.5 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ ధర జియోలో రూ. 799గా ఉంది. అదే ఎయిర్ టెల్ లో అయితే 8 శాతం లేదా రూ. 60 ఎక్కువ ధరతో రూ. 859గా ఉంది.
  • ఇక ఏడాది రీఛార్జ్ ప్లాన్ల పరంగా.. 24 జీబీ డేటా, ఆన్ లిమిటెడ్ కాలింగ్ ఒక ఏడాది పొందేందుకు జియో రూ. 1,899 ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఇదే రకమైన ప్లాన్ ఎయిర్ టెల్ లో 5 శాతం లేదా రూ. 100 ఎక్కువ ధరతో రూ. 1,999కు అందుబాటులో ఉంది.
click me!