వాట్సాప్‌లో లేటెస్ట్ కూల్ ఫీచర్.. దీని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..

By asianet news teluguFirst Published Nov 11, 2022, 5:57 PM IST
Highlights

వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్‌సైట్   వాట్సాప్ ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. ఇంకా ఈ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. నివేదిక ప్రకారం, మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌లో న్యూ అండ్ కూల్ ఫీచర్ డోంట్ డిస్టర్బ్ మోడ్ వచ్చేసింది.  బీటా టెస్టింగ్ కోసం కంపెనీ ఈ మోడ్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు ఇప్పుడు వాట్సాప్‌లో డూ నాట్ డిస్టర్బ్ మోడ్‌  ఉపయోగించుకోవచ్చు, అయితే మిస్డ్ కాల్స్ గురించి సమాచారం కూడా డోంట్ డిస్టర్బ్ సెట్టింగ్‌లలో ఉంటుంది. అంటే, ఇప్పుడు మీరు DND మోడ్‌లో ఉన్నప్పటికీ మీరు లేబుల్‌కి వెళ్లి కాల్స్ సమాచారాన్ని చూడచ్చు. తాజాగా వాట్సాప్ కొత్త కమ్యూనిటీ ఫీచర్‌ను కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 

వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్‌సైట్   వాట్సాప్ ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని అందించింది. ఇంకా ఈ ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. నివేదిక ప్రకారం, మీరు ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. దీని తర్వాత మీకు మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యుల నుండి వాట్సాప్ మెసేజెస్ అండ్ కాల్స్ నోటిఫికేషన్స్ సౌండ్స్  రావు.


అంటే, ఈ ఫీచర్ సహాయంతో, మీరు ఎటువంటి ఆటంకం లేకుండా మీ పనిపై దృష్టి పెట్టవచ్చు. అలాగే, DND మోడ్‌లో మిస్డ్ కాల్స్ కూడా చూడవచ్చు. మీ వాట్సాప్‌లో DND మోడ్ ఆన్ చేస్తే  కాల్స్ వచ్చినప్పుడు డు నాట్ డిస్టర్బ్  అనే లేబుల్ కనిపిస్తుంది. తర్వాత మీరు  డు నాట్ డిస్టర్బ్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా ఈ లేబుల్‌లో మిస్డ్ కాల్‌ల గురించి సమాచారాన్ని పొందగలరు. 

వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్
వాట్సాప్ తాజాగా  ఈ ప్లాట్‌ఫారమ్‌లో కమ్యూనిటీ ఫీచర్‌ను లాంచ్ చేసింది. వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ద్వారా పోల్స్ చేయవచ్చు ఇంకా సింగిల్ ట్యాప్ వీడియో కాలింగ్‌తో పాటు 32 మంది వీడియో కాలింగ్‌లో ఒకేసారి చేరవచ్చు. ఈ ఫీచర్‌లో మీరు కమ్యూనిటీలో అన్ని గ్రూప్స్ ఉంచవచ్చు.

కమ్యూనిటీలోని గరిష్టంగా 20 గ్రూప్స్ ఒకే సమయంలో చేర్చవచ్చు. కమ్యూనిటీలను కంపెనీ మొదట ఏప్రిల్‌లో పరీక్షించింది ఇప్పుడు  అందరికీ అందుబాటులోకి వస్తోంది.
 

click me!