నాలుగు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిన కూ యాప్.. ఇప్పుడు 10 ప్రొఫైల్ ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు..

By asianet news teluguFirst Published Nov 11, 2022, 5:13 PM IST
Highlights

యూజర్లు ఇప్పుడు గరిష్టంగా 10 ప్రొఫైల్ ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఎవరైనా యూజర్ మరొకరి ప్రొఫైల్‌ని చూసినప్పుడు, ఈ ఫోటోలు ఆటోమేటిక్ గా ప్లే అవుతాయి.

ఇండియన్ మైక్రో బ్లాగింగ్ కూ యాప్ నాలుగు కొత్త ఫీచర్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్లలో  ప్రొఫైల్ ఫోటోలను అప్‌లోడ్ చేయడం, కూ పోస్ట్‌లను సేవ్ చేయడం, కూ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం,  డ్రాఫ్ట్‌లను సేవ్ చేయడం వంటివి ఉన్నాయి. కూ యాప్ తాజాగా 50 మిలియన్ డౌన్‌లోడ్‌లను సాధించి తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మైక్రో బ్లాగింగ్ సైట్‌గా అవతరించింది. ప్రస్తుతం కూ  యాప్ 10 భాషల్లో అందుబాటులో ఉంది.

కూ యాప్ కొత్త ఫీచర్లు
10 ప్రొఫైల్ ఫోటోలు: యూజర్లు ఇప్పుడు గరిష్టంగా 10 ప్రొఫైల్ ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు. ఎవరైనా యూజర్ మరొకరి ప్రొఫైల్‌ని చూసినప్పుడు, ఈ ఫోటోలు ఆటోమేటిక్ గా ప్లే అవుతాయి. డ్రాగ్ అండ్ డ్రాప్ ఫంక్షన్‌తో ఈ ఫోటోల ఆర్డర్ మార్చడం కూడా చాలా సులభం.

షెడ్యూలింగ్ కూ : పవర్ క్రియేటర్స్ వంటి మీడియా సంస్థలు ఇప్పుడు కూని కూడా షెడ్యూల్ చేయవచ్చు. ఒకేసారి మల్టీ రకాల కంటెంట్‌ను షేర్ చేయాలనుకునే క్రియేటర్స్ కి  పనిని చాలా సులభతరం చేస్తుంది. యూజర్లు షెడ్యూల్ చేసిన కూను ఎడిట్ చేయవచ్చు లేదా రి-షెడ్యూల్ చేయవచ్చు.

డ్రాఫ్ట్‌  సేవ్ : డ్రాఫ్ట్‌ను పోస్ట్ చేయడానికి ముందు దాన్ని ఎడిట్ చేయాలనుకునే క్రియేటర్‌లు డ్రాఫ్ట్ సేవ్ ఫంక్షన్‌ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా పోస్ట్ చేయడానికి ముందు ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

 కూ  సేవ్: యూజర్లు ఇప్పుడు లైక్, కామెంట్, రీ-కు లేదా షేర్ వంటి సాధారణ ప్రతిచర్యలకు బదులుగా కూ పోస్ట్‌ను సేవ్ చేయవచ్చు. సేవ్ చేసిన కూలు యూజర్లకు మాత్రమే కనిపిస్తాయి ఇంకా వారి ప్రొఫైల్ పేజీలో ఉంటాయి. కూ యాప్‌లో కామెంట్ చేయకుండా వారికి ఇష్టమైన లేదా ముఖ్యమైన పాటలను  చెక్ చేయాలనుకునే యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త ఫీచర్ల లాంచ్ పై కూ యాప్ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవత్కా మాట్లాడుతూ, “మా యూజర్లకు కొత్త ఫీచర్‌లను ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ ఫీచర్లలో కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మొదటిసారి వచ్చాయి. 10 ప్రొఫైల్ ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి యూజర్లకు అనుమతించే మొదటి ప్లాట్‌ఫారమ్ మేము. పవర్ క్రియేటర్‌లు ఇప్పుడు డ్రాఫ్ట్‌లను సేవ్ చేయడం ఇంకా తేదీ, సమయం పై కూ పోస్ట్‌లను షెడ్యూల్ చేయడాన్ని మేము చాలా సులభతరం చేసాము. కూ పోస్ట్‌ను సేవ్ చేసే సదుపాయం మరే ఇతర మైక్రో-బ్లాగ్‌లో లేదు.

click me!