టిక్‌టాక్ ప్రియుల కోసం ఎలాన్ మస్క్ కోత్త యాప్‌.. పాపులారిటీని చూసి భయపడ్డ ఫేస్‌బుక్..

By asianet news telugu  |  First Published Nov 3, 2022, 1:09 PM IST

వైన్ యాప్‌లో గరిష్టంగా ఆరు సెకన్ల వరకు వీడియో క్లిప్‌లను మాత్రమే షేర్ చేయవచ్చు. ఈ యాప్ కి ఆ సమయంలో 200 మిలియన్ల మంది ప్రతినెల యాక్టివ్ యూజర్లు ఉండేవారు.


షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ లవర్స్ కి గుడ్ న్యూస్. ట్విట్టర్ కొత్త బాస్ ఎలోన్ మస్క్ షార్ట్ వీడియో యాప్ వైన్‌ను మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఎలోన్ మస్క్  ట్విట్టర్ అక్కౌంట్ లో బ్రింగ్ బ్యాక్ వైన్ ? పేరుతో ఒక పోల్ కూడా పోస్ట్ చేసారు. ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ వైన్ యాప్ రిలాంచ్ ని సూచిస్తోంది. టిక్‌టాక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌కు ముందు వైన్ యాప్ తో షార్ట్ వీడియోలు రూపొందించేవారు.

 గతంలో ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేయడానికి వైన్ యాప్ మాత్రమే ఉపయోగించేవారు. ఈ యాప్‌లో గరిష్టంగా ఆరు సెకన్ల వరకు వీడియో క్లిప్‌లను మాత్రమే షేర్ చేయవచ్చు. ఈ యాప్ కి ఆ సమయంలో 200 మిలియన్ల ప్రతినెల యాక్టివ్ యూజర్లు ఉండేవారు. అయితే, ఈ యాప్ 2016లో నిలిపివేయబడింది. ఇప్పుడు ఎలోన్ మస్క్ దానిని తిరిగి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Latest Videos

undefined

పదేళ్ల క్రితం
వైన్ యాప్ 2012 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. యాప్‌ను డోమ్ హాఫ్‌మన్, రస్ యూసుపోవ్ ఇంకా కోలిన్ క్రోల్ డెవలప్ చేశారు. ఆ తర్వాత ఈ యాప్‌ను ట్విట్టర్‌ కొనుగోలు చేసింది, కేవలం మూడు సంవత్సరాలలో ఈ యాప్ ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే దాని ఆక్టివ్ యూజర్ల సంఖ్య 200 మిలియన్లను (అంటే 20 కోట్లు) మించిపోయింది. 

ఫేస్‌బుక్ యాప్‌ 
ఈ యాప్ ఎక్కువగా Facebookపై ఆధారపడి ఉంటుంది. ఈ యాప్ జనాదరణకు భయపడి Facebook ఈ యాప్ APIకి యాక్సెస్‌ మూసివేయడం జరిగింది. అంటే, దీని తర్వాత వైన్ యూజర్లు  ఫేస్‌బుక్ అక్కౌంట్ కి ఈ సర్వీస్ తో కనెక్ట్ చేయలేకపోయారు, దీంతో క్రమంగా ఈ యాప్ దాని ప్రజాదరణను కోల్పోయింది చివరికి 2016 సంవత్సరంలో మూసివేయబడింది.  

click me!