హోలీ ఫెస్టివల్ పార్టీ కోసం 30Wస్పెషల్ స్పీకర్‌ను విడుదల చేసిన పోర్ట్రానిక్స్.. దీని బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Mar 23, 2021, 08:06 PM IST
హోలీ ఫెస్టివల్ పార్టీ కోసం 30Wస్పెషల్ స్పీకర్‌ను విడుదల చేసిన పోర్ట్రానిక్స్.. దీని బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే ?

సారాంశం

పోర్ట్రానిక్స్ బ్రాండ్  హోలీ పండుగ పార్టీల కోసం అనుగుణంగా ఒక కొత్త 30-వాట్ల బ్లూటూత్ స్పీకర్‌ను విడుదల చేసింది. పోర్ట్రానిక్స్  సంస్థ ఈ స్పీకర్‌కు సౌండ్‌డ్రమ్ ఎల్ అని పేరు పెట్టింది, దీనికి 5.0 బ్లూటూత్ ఫీచర్ కూడా ఉంది. 

పోర్టబుల్ అండ్ ఇన్నోవేటివ్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్  లీడర్ పోర్ట్రానిక్స్ బ్రాండ్  హోలీ పండుగ పార్టీల కోసం అనుగుణంగా ఒక కొత్త 30-వాట్ల బ్లూటూత్ స్పీకర్‌ను విడుదల చేసింది. పోర్ట్రానిక్స్  సంస్థ ఈ స్పీకర్‌కు సౌండ్‌డ్రమ్ ఎల్ అని పేరు పెట్టింది, దీనికి 5.0 బ్లూటూత్ ఫీచర్ కూడా ఉంది. అదనపు కనెక్టివిటీ ఆప్షన్స్  కోసం స్పీకర్ కి 3.5 ఎంఎం ఆక్స్, పెన్‌డ్రైవ్‌ ఆప్షన్ కి  కూడా ఉంది.

సౌండ్‌డ్రమ్ ఎల్ స్పీకర్ ఒక సిలిండర్ స్టైల్ లో వస్తుంది. దీని ప్రయోజనం ఏమిటంటే  దీనిని ఇంట్లో ఏ మూలలోనైనా హాయిగా ఉంచవచ్చు. సౌండ్‌డ్రమ్ ఎల్ కి ప్రత్యేకమైన ఈక్వలైజర్ బటన్‌ ఉంది, ఇది వినియోగదారులకు  బేస్ అండ్ ట్రెబుల్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. బేస్ పెంచడానికి ఈక్వలైజర్ బటన్‌ను ఒకసారి నొక్కండి, అలాగే ట్రెబుల్ పెంచడానికి దాన్ని మళ్ళీ ఇంకోసారి నొక్కల్సి ఉంటుంది.

also read అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్టివల్ సేల్ : స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు భారీ డిస్కౌంట్ పొందండి.. ...


పోర్ట్రానిక్స్ సౌండ్‌డ్రమ్ ఎల్ స్పీకర్ బ్యాటరీ 6 గంటల బ్యాకప్ ఇస్తుందని క్లెయిమ్ చేయబడింది. దీని బిల్ట్ క్వాలిటీ అద్భుతమైనదని కంపెనీ తెలిపింది. అలాగే దాని బాడీలో అధిక-నాణ్యత గల పదార్థం ఉపయోగించారు. ఈ స్పీకర్ వాటర్ ఇంకా డస్ట్‌ప్రూఫ్ కోసం IPX6 రేటింగ్‌ను పొందింది.

ఈ స్పీకర్ గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని ఇతర స్పీకర్లకు కూడా కనెక్ట్ చేయవచ్చు. సౌండ్‌డ్రమ్ ఎల్ ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది.  అన్ని ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి 3,599 రూపాయల ధరకే కొనుగోలు చేయవచ్చు.

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్