అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్టివల్ సేల్ : స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు భారీ డిస్కౌంట్ పొందండి..

By S Ashok Kumar  |  First Published Mar 23, 2021, 1:55 PM IST

 ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. అంతేకాకుండా  జీరో కాస్ట్  ఈ‌ఎం‌ఐ ప్లాన్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, స్మార్ట్ ఫోన్స్ ఇంకా డివైజెస్ పై ఇన్స్టంట్ డిస్కౌంట్లను కూడా ఇస్తుంది.
 


ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్టివల్ సేల్ తీసుకువచ్చింది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. అంతేకాకుండా  జీరో కాస్ట్  ఈ‌ఎం‌ఐ ప్లాన్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, స్మార్ట్ ఫోన్స్ ఇంకా డివైజెస్ పై ఇన్స్టంట్ డిస్కౌంట్లను కూడా ఇస్తుంది.

అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ నేటి నుండి  అధికారిక వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంటుంది, ఫిబ్రవరి 25తో ముగుస్తుంది. తాజా వన్‌ప్లస్ 9 సిరీస్ నుండి షియోమి, శామ్‌సంగ్, ఆపిల్, ఒప్పో, హానర్, వివో వంటి  ఫోన్‌ల పై మరిన్ని డిస్కౌంట్‌లని ఆఫర్ చేస్తుంది.

Latest Videos

also read 

 ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేసే వారి కోసం 10% తక్షణ డిస్కౌంట్  అంటే వెయ్యి రూపాయల వరకు ఆఫర్ చేస్తుంది. అలాగే 12 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐతో పాటు రూ .2,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

 హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఇఎంఐ ఆఫర్‌ను పొందవచ్చు. ఇంకా నెలకు 1,333 రూపాయల నుండి లో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ కూడా అందిస్తుంది.

అమ్మకం సమయంలో అమెజాన్ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లపై 35% తగ్గింపుతో పాటు 12 నెలల వరకు నో-కాస్ట్ ఈ‌ఎం‌ఐని అందిస్తోంది. అలాగే పవర్ బ్యాంకులు, హెడ్‌సెట్‌లతో సహా మొబైల్ డివైజెస్ పై కూడా  డిస్కౌంట్లు ఉన్నాయి.

click me!