ఇదేం బాలేదు.. ‘ఐఫోన్’ బటన్ తొలగింపుపై ట్రంప్

By Rekulapally SaichandFirst Published Oct 27, 2019, 5:22 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోపం వచ్చింది. ఐఫోన్ లో హోంబటన్ ఏత్తేయడంతో హోం స్క్రీన్ వద్దకు వెళ్లాలంటే ప్రతిసారి స్వైప్ చేయాల్సి రావడంతో ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇదేం బాగా లేదని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేఖలో తెలిపారు.  
 

వాషింగ్టన్: ఐఫోన్ కొత్త డిజైన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత డిజైన్‌లో ఉండే హోం బటనే బాగుండేదని, స్వైప్ కొంచెం ఇబ్బందిగా ఉందని పేర్కొంటూ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఐఫోన్ వినియోగిస్తున్న ట్రంప్.. దాని డిజైన్ పై తాజాగా ఒక ట్వీట్ చేశారు. ‘టిమ్ (టిమ్ కుక్‌ను ఉద్దేశిస్తూ)! ఐఫోన్ లో స్వైప్ కంటే బటనే చాలా బాగుంది’ అని పేర్కొన్నారు.

కొత్త మోడల్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది ఎదురవుతుందని ఏకరువు పెట్టారు. అయితే, ట్రంప్ ఆగ్రహానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ఐఫోన్ -10లో ఆపిల్ చిన్న మార్పులు చేసింది. 

 

కొత్త మోడళ్లలో హోం బటన్‌ను తొలగించి అప్‌గ్రేడ్ చేసింది. తాజాగా తీసుకొచ్చిన ఐఫోన్ 11, ఐఫోన్ 11 మ్యాక్స్ ప్రో ఫోన్లలోనూ హోం బటన్లు తీసేసింది. దీంతో హోం స్క్రీన్‌కు రావాలంటే యూజర్ ప్రతిసారి స్క్రీన్ స్వైప్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ మార్పు వల్ల సాధారణ కస్టమర్లతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పడుతున్నారు. 
 
ఇది పాత మోడల్ కావడంతో ప్రభుత్వం దానిని అప్‌గ్రేడ్ చేసి కొత్త మోడల్‌ను ట్రంప్‌ చేతిలో పెట్టింది. ఇప్పుడందులో హోం బటన్ లేకపోయే సరికి ట్రంప్‌కు చిర్రెత్తుకొచ్చింది. కొత్త ఫోన్లలో హోం స్క్రీన్‌కు రావాలంటే ప్రతిసారీ స్క్రీన్‌ను స్వైప్ చేసుకోవాల్సి రావడంతో సాధారణ కస్టమర్లు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ట్రంప్‌కు కూడా ఇదే అనుభవం ఎదురవుతుండడంతో టిమ్‌కుక్‌కు ట్వీట్ చేశారు. 

రారాజుగా షియోమీ..పండుగ సేల్స్ ఎంత తెలుసా!

హోం బటన్ ఉన్నప్పుడే ఐఫోన్ వాడడం సులభంగా ఉండేదన్నారు. కాగా, ట్రంప్ ఈ ట్వీట్ చేసిన తర్వాత గతంలో యాపిల్‌ను ఉద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆపిల్ కూడా శాంసంగ్‌లా పెద్దపెద్ద స్క్రీన్లు ఉన్న ఫోన్లు విడుదల చేయాలని, అందులో హోం బటన్‌ తొలగించాలని పేర్కొన్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ట్వీట్ చేయడంపై నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

ప్లే స్టోర్ లోకి ఎంఐ పేమెంట్ యాప్

2017లో విడుదల చేసిన ఐఫోన్ టెన్‌లో ఆపిల్ ఈ మార్పులు చేసింది. నాటి నుంచి తీసుకొచ్చిన అన్ని ఫోన్లలో హోం బటన్‌ను తొలగించి వేసింది. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ పోన్లను కూడా బటన్ లేకుండానే విడుదల చేసింది. 

click me!