చైనా యాప్స్ పై మరో డిజిటల్ స్ట్రైక్: ఈసారి 54 మొబైల్ యాప్‌లను నిషేదించిన ప్రభుత్వం..

Ashok Kumar   | Asianet News
Published : Feb 14, 2022, 12:47 PM IST
చైనా యాప్స్ పై మరో డిజిటల్ స్ట్రైక్:  ఈసారి 54 మొబైల్ యాప్‌లను నిషేదించిన ప్రభుత్వం..

సారాంశం

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ 54 చైనా యాప్‌(china apps)లను నిషేధించింది. ఈ యాప్‌లన్నీ భారతీయ వినియోగదారుల డేటాను చైనా(china) ఇంకా ఇతర దేశాలకు పంపుతున్నట్లు ఇంకా ఈ యాప్‌లు భారతీయ వినియోగదారుల డేటాను విదేశీ సర్వర్‌లకు బదిలీ చేస్తున్నాయని చెబుతున్నారు.  

డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ ద్వారా 54 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం మరోసారి నిషేధించింది. అయితే ఇప్పటివరకు నిషేధిత యాప్‌ల అధికారిక జాబితా వెల్లడి కాలేదు, అయితే ప్రభుత్వం భారతదేశంలో 54 చైనీస్ యాప్‌లను నిషేధించినట్లు చెబుతున్నారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లను నిషేధించింది. ఈ యాప్‌లన్నీ భారతీయ వినియోగదారుల డేటాను చైనా ఇంకా ఇతర దేశాలకు చేరవేస్తున్నాయని అలాగే ఈ యాప్‌లు భారతీయ వినియోగదారుల డేటాను విదేశీ సర్వర్‌లకు బదిలీ చేస్తున్నాయని చెబుతున్నారు. మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లను నిషేధించాలని గూగుల్ ప్లే స్టోర్‌ను ఆదేశించింది.

ఈ 54 నిషేధిత యాప్‌ల జాబితాలో  టెన్సెంట్, అలీబాబా అండ్ గేమింగ్ సంస్థ NetEase వంటి పెద్ద చైనీస్ కంపెనీల యాప్‌లు ఉన్నాయి. నిషేధానికి గురైన ఈ 54 యాప్‌లు 2020లో నిషేధించిన యాప్‌లకు కొత్త అవతారం అని చెబుతున్నారు.

నిషేధించబడిన 54 యాప్‌ల జాబితా
నిషేధించబడిన 54 చైనీస్ యాప్‌లలో బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్‌డి, బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా, ఈక్వలైజర్ & బాస్ బూస్టర్, క్యామ్‌కార్డ్ సేల్స్‌ఫోర్స్ ఎంట్, ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఒమియోజీ చెస్, ఒమియోజీ చెస్, ఒమియోజీ అరెనా, యాప్ లాక్ , డ్యూయల్ స్పేస్ లైట్ ఉన్నాయి.

గత ఏడాది 2020లో కూడా భారత ప్రభుత్వం 250కి పైగా చైనీస్ యాప్‌లను నిషేధించింది, అందులో టిక్‌టాక్, పబ్‌జి వంటి పెద్ద యాప్‌ల పేర్లు ఉన్నాయి. వీటితో పారు  షేర్ ఇట్,  విచాట్, హెలొ, లైకి, యూ‌సి న్యూస్, బిగో లైవ్, యూ‌సి బ్రౌసర్, ES File Explorer, Mi కమ్యూనిటీ వంటి యాప్‌లు మొదటి డిజిటల్ సర్జికల్ స్ట్రైక్‌లో నిషేధించబడ్డాయి.
 

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?