ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Realme నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రానుంది. రియల్‌మీ సీ35 పేరుతో ఈ మొబైల్ వస్తోంది. థాయ్‌లాండ్‌లో ఈ నెల 10న విడుదలైన ఈ మొబైల్.. త్వరలోనే భారత్‌కు సైతం రానుంది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Realme నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రానుంది. రియల్‌మీ సీ35 పేరుతో ఈ మొబైల్ వస్తోంది. థాయ్‌లాండ్‌లో ఈ నెల 10న విడుదలైన ఈ మొబైల్.. త్వరలోనే భారత్‌కు సైతం రానుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 6.6 ఇంచుల డిస్‌ప్లేతో ఈ మొబైల్ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన గ్రీన్ కలర్ వేరియంట్‌ను రియల్‌మీ టీజ్ చేసింది. కాగా ఈ ఫోన్‌ను థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి 10న విడుదల చేసినట్టు సోషల్ మీడియా అధికారిక ఖాతాల్లో ఆ సంస్థ వెల్లడించింది.
రియల్‌మీ సీ35.. ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో వస్తోంది. అంచులు ఫ్లాట్‌గా ఉండే డిజైన్‌తో వస్తున్న తొలి రియల్‌మీ మొబైల్ ఇదే. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. అయితే భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేస్తుందో సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది జులైలోపు ఈ ఫోన్ భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Realme C35 Specifications
Realme C35 మొబైల్ 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో రానుంది. అలాగే అక్టాకోర్ UniSoC T616 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ నడవనుంది. అలాగే 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, టైప్-సీ చార్జింగ్ పోర్టు, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. Relame C35 వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. దాంట్లో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మాక్రో, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్ 11 ఉంటుంది.
ఈ 5 ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుండగా.. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఛార్జింగ్ USB-C పోర్ట్‌ను కలిగి ఉంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ అమర్చారు. Wi-Fi, బ్లూటూత్, GPS, 4G LTE కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. లైట్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్, మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ ఉన్నాయి. అలాగే 8.1mm మందంగానూ 189 గ్రాముల బరువు ఉంటుంది. అలాగే 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. కాగా థాయ్‌లాండ్‌లో Relame C35 ప్రారంభ ధర 5799 థాయ్ బట్లు (దాదాపు రూ.13,150)గా ఉంది.
మరోవైపు ఈ నెల 16వ తేదీన భారత్‌లో రియల్‌మీ 9 ప్రో, రియల్‌మీ 9ప్రో+ మొబైళ్లు లాంచ్ కానున్నాయి. ఈ మిడ్‌రేంజ్ 5జీ ఫోన్లు ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో రానున్నాయి. ముఖ్యంగా రియల్‌మీ 9 ప్రో+ ప్రత్యేకమైన హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్‌తో వస్తోంది.