చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నుంచి మూడు సరికొత్త 9 సిరీస్ ఫోన్లు రానున్నాయి. వచ్చేవారం భారత మార్కెట్లో ఫిబ్రవరి 16న రియల్‌మీ 9 సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నుంచి మూడు సరికొత్త 9 సిరీస్ ఫోన్లు రానున్నాయి. వచ్చేవారం భారత మార్కెట్లో ఫిబ్రవరి 16న రియల్‌మీ 9 సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Realme 9 Pro, Realme 9 Pro+ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర లాంచింగ్ ముందే లీక్ అయ్యాయి. ఈ రెండు రియల్‌మీ ఫోన్లతో పాటు మరో రియల్‌మీ 9 సిరీస్ 5G ఫోన్ ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. దీనిబట్టి రియల్‌మీ 9 సిరీస్ నుంచి 5G స్మార్ట్ ఫోన్ (vanilla Realme 9 5G) కూడా రానున్నట్టు పాపులర్ టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
ఇప్పటికే మొదటి రెండు సిరీస్ ఫోన్లకు సంబంధించి కంపెనీ అధికారికంగా ప్రకటించినప్పటికీ మూడోది 5G (Vanilla Realme 9 5G ఫోన్ రానున్నట్టు రియల్‌మీ కంపెనీ రివీల్ చేయలేదు. అయితే ముందుగా, Realme 9 Pro Realme 9 Pro+ సిరీస్ ఫీచర్లు, ధరలు లీకయ్యాయి. ఈ రిటైల్ బాక్సులను ముందుగా Gizmochina గుర్తించింది.. లీకైన డేటా ప్రకారం.. Realme 9 Pro ధర రూ. 18,999గా ఉంది. భారత మార్కెట్లో Realme 9 Pro+ ధర రూ. 24,999గా ఉండనుంది.
ఈ లీకైన 9 సిరీస్ రెండు ఫోన్ల MRP ధరలు.. లాంచ్ ధరలు కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ Realme 9 ప్రో సిరీస్ ధరలు గతంలో రిలీజ్ అయిన Realme సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఎక్కువగా ఉంటాయని Realme గతంలోనే వెల్లడించింది. పెరిగిన ధర కూడా భారీ ఫీచర్ల అప్‌గ్రేడ్‌తో రానుందని భావిస్తున్నారు. Vanilla Realme 9 5G ఫీచర్లు ఆధారంగా డివైజ్ గతంలో రెండు మోడల్ ఫోన్ల మాదిరిగానే ఉండొచ్చునని టిప్ స్టర్ భావిస్తోంది. Realme 9 Pro సిరీస్‌ను లాంచ్ అయిన తర్వాత ఈ 5G స్మార్ట్ ఫోన్ కంపెనీ రివీల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ Realme 9 5G ధరపై ఎలాంటి సమాచారం లేదు. అయితే Realme 9 Pro సిరీస్ ధర రూ. 15వేల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. భారత్ మార్కెట్లో సబ్-15వేల విభాగంలోకి వస్తుందని అంచనా వేస్తోంది. Realme 8 5G కంటే అతిపెద్ద అప్‌గ్రేడ్ చిప్‌సెట్ తో రానున్నట్టు టిప్ స్టర్ అంచనా వేసింది.
Realme 9 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Realme 9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్‌సెట్‌తో రానుంది. ఖచ్చితంగా Realme 8 5Gకి పవర్ డైమెన్సిటీ 700 కంటే అప్‌గ్రేడ్ గా రానుంది ప్రాసెసర్ గరిష్టంగా 8GB RAM 128GB ఇంటర్నెట్ స్టోరేజీతో రావొచ్చు. 6GB RAM, 64GB స్టోరేజీ కాన్ఫిగరేషన్, 8GB RAM, 128GB స్టోరేజీ మోడల్‌తో రావొచ్చు. Realme 9 5G Android 12-ఆధారిత Realme UI 3.0తో రావచ్చు. ఈ డివైజ్ ముందు భాగంలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేతో రానుంది.
కెమెరా పీచర్లు ఇవే (అంచనా)
Realme 9 5G కెమెరాలలో 48MP మెయిన్ సెన్సార్, 2-MP డెప్త్ సెన్సార్, వెనుకవైపు 2-MP మైక్రో సెన్సార్ ఉండవచ్చు. సెల్ఫీల కోసం.. 16-MP కెమెరా ఉండవచ్చు. ఫోన్ పంచ్-హోల్ సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. Realme 9 5G స్టీరియో స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రానుంది. ఫోన్ LCD ప్యానెల్‌తో రానుంది. Realme 9 5G 5000mAh బ్యాటరీతో రానుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుందని టిప్‌స్టర్ తెలిపింది.
Realme 9 Pro, Realme 9 Pro Plus ఫిబ్రవరి 16న భారత మార్కెట్‌లో లాంచింగ్‌కు రెడీ కానుంది. రియల్‌మీ 9 ప్రో+ ప్రధాన కెమెరాలో సోనీ IMX766 ఫ్లాగ్‌షిప్ సెన్సార్, మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, వెనుక ప్యానెల్‌లో కలర్-షిఫ్టింగ్ డిజైన్‌తో రానుందని Realme కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.