డబ్బు పంపుతున్నారా.. ఇలా చేస్తే SMS రాదు.. బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..

By Ashok kumar Sandra  |  First Published May 29, 2024, 11:35 AM IST

కనీస మొత్తం కంటే తక్కువ UPI ట్రాన్సక్షన్స్  పై బ్యాంక్ కస్టమర్‌లు ఇక టెక్స్ట్ మెసేజెస్  పొందలేరు. తాజాగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది, కానీ ఈ రూల్ వెంటనే అమలులోకి రావడం లేదు. 


ముంబై : మీకు అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు HDFC బ్యాంక్ గురించి తెలిసే ఉండాలి. మీరు ఈ బ్యాంక్ కస్టమర్ అయితే, మీకోసం ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. కనీస మొత్తం కంటే తక్కువ UPI ట్రాన్సక్షన్స్  పై బ్యాంక్ కస్టమర్‌లు ఇక టెక్స్ట్ మెసేజెస్  పొందలేరు. తాజాగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది, కానీ ఈ రూల్ వెంటనే అమలులోకి రావడం లేదు. ఈ నిర్ణయం వచ్చేనెల 25 నుంచి అమలులోకి రానుంది.

Latest Videos

undefined

HDFC బ్యాంక్ నిర్ణయం ఏమిటి?

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్‌లకు పంపిన సమాచారంలో, జూన్ 25, 2024 నుండి మీ SMS అలర్ట్ సర్వీస్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలియజేసింది. ఇప్పుడు మీరు UPI ద్వారా ఎవరికైనా రూ. 100 కంటే ఎక్కువ డబ్బు పంపితే అప్పుడు మాత్రమే SMS అలెర్ట్ వస్తుంది. అదేవిధంగా మీరు రూ. 500 కంటే ఎక్కువ అందుకున్నట్లయితే, అప్పుడు మాత్రమే SMS అలెర్ట్  పంపబడుతుంది.

click me!