budget smart tv:అతితక్కువ ధరకే 39-అంగుళాల స్మార్ట్ టి‌వి.. ఒకేసారి 4 టీవీలను లాంచ్ చేసిన దైవా..

Ashok Kumar   | Asianet News
Published : Feb 22, 2022, 01:41 PM ISTUpdated : Feb 22, 2022, 01:42 PM IST
budget smart tv:అతితక్కువ ధరకే 39-అంగుళాల స్మార్ట్ టి‌వి.. ఒకేసారి 4 టీవీలను లాంచ్ చేసిన దైవా..

సారాంశం

దేశీయ కంపెనీ  దైవ (Daiwa) తాజాగా నాలుగు కొత్త స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. ఇందులో 39-అంగుళాల దైవ D40HDR9L ధర రూ. 17,990, అదే సైజ్ ఉన్న వాయిస్ అసిస్టెంట్ మోడల్ దైవ D40HDR9LA ధర రూ. 18,490.  

కొత్త సంవత్సరం 2022ని అట్టహాసంగా ప్రారంభమైంది, అయితే దేశీయ కంపెనీ  దైవ (Daiwa) తాజాగా నాలుగు కొత్త స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది, ఇందులో 32 అంగుళాల నుండి 39 అంగుళాల వరకు మోడల్‌లు ఉన్నాయి.  దైవ D32SM9, దైవ D40HDR9L మోడల్‌ల క్రింద నాలుగు టీవీలను పరిచయం చేసింది. ఈ టీవీల ఇతర రెండు మోడల్‌లు దైవ D32SM9A, దైవ D40HDR9LA. ఈ టీవీ వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా క్లౌడ్ టీవీ ఓఎస్ టీవీకి సపోర్ట్ ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, జీ5 ఇంకా సోనీలివ్ వంటి యాప్‌లు ఇందులో ఇంటర్నల్ గా అందుబాటులో ఉంటాయి.

ధర
32-అంగుళాల దైవ D32SM9 ధర రూ. 11,990, అదే సైజ్ ఉన్న వాయిస్ అసిస్టెంట్ మోడల్ దైవ D32SM9A ధర రూ. 12,490. 39-అంగుళాల దైవ D40HDR9L ధర రూ. 17,990 అయితే ఈ సైజ్ లో ఉన్న వాయిస్ అసిస్టెంట్ మోడల్ దైవ D40HDR9LA ధర రూ. 18,490.

 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 9పై ఆధారితమైన దైవా  ఈ నాలుగు టీవీలలో క్లౌడ్ టీవీ OS అందుబాటులో ఉంటుంది. దైవ D32SM9, D32SM9A రెండు మోడళ్లు 1366x768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 32-అంగుళాల HD రెడీ డిస్‌ప్లేతో వస్తున్నాయి. టి‌వితో పాటు Quatum Luminite టెక్నాలజీకి సపోర్ట్ ఉంది. D40HDR9L, D40HDR9LA మోడల్‌లు 1366x768 రిజల్యూషన్‌తో 39-అంగుళాల డిస్‌ప్లేతో వస్తాయి. అన్ని టీవీలు క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో 1GB RAMని కలిగి ఉంటాయి.

దైవ D32SM9, D32SM9Aలు 20W స్టీరియో స్పీకర్‌లతో ఉండగా, దైవ D40HDR9L, D40HDR9LA స్పీకర్‌లతో పాటు సరౌండ్ సౌండ్ బాక్స్‌తో వస్తాయి. కనెక్టివిటీ కోసం అన్ని టీవీలలో రెండు HDMI, రెండు USB టైప్-A పోర్ట్‌లు, Wi-Fi, ఈథర్‌నెట్ అండ్ ఆప్టికల్ అవుట్‌పుట్ ఉన్నాయి. టీవీతో ఇంటర్నల్ బ్లూటూత్ అందుబాటులో ఉండదు.

దైవ D32SM9, D32SM9A, D40HDR9L, D40HDR9LA టీవీలతో  అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్ని + హాట్ స్టార్ వంటి యాప్‌లకు సపోర్ట్ చేయబడతాయి. టీవీతో పాటు మూవీ బాక్స్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది, దీనితో 25,000 ఉచిత సినిమాలు అందుబాటులో ఉంటాయి. దైవా D32SM9A, D40HDR9LAతో వచ్చే రిమోట్ వాయిస్ కమాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

OPPO Find X9: 200 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఏఐ ఫీచ‌ర్లు.. ఒప్పో నుంచి కొత్త ఫోన్
Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే