SBI Alert: క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్​బీఐ కీల‌క సూచ‌న‌లు.. ఈ తప్పులు చేయకండి..!

By team telugu  |  First Published Feb 22, 2022, 12:41 PM IST

సైబర్​ నేరగాళ్లు ఆన్​ లైన్ పేమెంట్స్ చేసే వాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆసరాగా చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల క్యూఆర్​ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం సర్వ సాధారణమైంది. 


ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ కస్టమర్లను అలర్ట్​ చేసింది. ఈ మధ్య కాలంలో ఆన్ ​లైన్​ లావాదేవీలు భారీగాపెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్​ నేరగాళ్ల వలలో క‌స్ట‌మ‌ర్లు పడకుండా సురక్షితంగా ఆన్​లైన్ లావైదేవీలు జరిపేందుకు ముఖ్యమైన సలహాలు చేసింది ఎస్​బీఐ.

సైబర్​ మోసాలు ఎలా జరుగుతున్నాయంటే..?

Latest Videos

undefined

సైబర్​ నేరగాళ్లు ఆన్​ లైన్ పేమెంట్స్ చేసే వాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆసరాగా చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల క్యూఆర్​ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం సర్వ సాధారణమైంది. ఆఫర్లు, లక్కీ డ్రా వంటి వాటి పేర్లతో మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మీకు బహుమతి రావాలంటే మీ యూపీఐ పేమెంట్ యాప్​ ద్వారా క్యూఆర్​ కోడ్​ స్కాన్​, చేసి పిన్ ఎంటర్​ చేయాలంటూ కస్టమర్లను మభ్య పెడుతున్నారు. అది నమ్మి స్కాన్​ చేసి పిన్ ఎంటర్ చేసిన వారి ఖాతాల నుంచి డబ్బులు కొల్ల‌గొడుతున్నారు. ఇలా కొంత మంది న‌మ్మి డబ్బులు కోల్పోయిన నేపథ్యంలో ఎస్​బీఐ అలర్ట్ అయ్యింది. ఇలాంటి మోసాల బారిన మరెవ్వరూ పడకుండా యూపీఐ పేమెంట్స్ చేసే వారికి 6 కీలక సూచనలు చేసింది.

యూపీఐ పేమెంట్స్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

- యూపీఐ పిన్ అనేది కేవలం డబ్బులు ట్రాన్స్​ఫర్ చేయడానికి మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు రిసీవ్​ చేసుకునేందుకు ఎలాంటి పిన్ అవసరం లేదు.
- ఏదైనా మొబైల్ నంబర్​, యూపీఐ ఐడీకి డబ్బులు పంపే ముందు.. డిస్​ప్లేలో వచ్చే పేరును ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.
- మీ యూపీఐ పిన్​ను ఎవరితోనూ చెప్పొద్దు.
- షాప్​ల వద్ద, మరెక్కడైనా చెల్లింపులు చేయాల్సి వస్తే.. స్కాన్ ఆప్షన్​కు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. స్కాన్ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తితో పేరును ధ్రువీకరించమని అడ‌గ‌టం ఇంకా ఉత్తమం.
- యూపీఐ, ఆన్​లైన్ పేమెంట్స్ విషయంలో ఏదైనా సమస్య వచ్చినా.. ఏదైనా సందేహం ఉన్నా బ్యాంకును సంప్రదించి మాత్రమే పరిష్కరించుకోవాలి. అపరిచిత వ్యక్తులతో ఇలాంటి విషయాల్లో సహాయం తీసుకోకూడ‌దు.
- యూపీఐ ద్వారా చేసిన పేమంట్స్​కు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే.. సంబంధిత పేమెంట్ యాప్​ హెల్ప్​ సెక్షన్​కు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి.

click me!