first sale:నేడే పోకో ఎం4 ప్రొ 5జి ఫస్ట్ సేల్.. ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి.. ధర, ఫీచర్లు తెలుసుకోండి

By asianet news telugu  |  First Published Feb 22, 2022, 11:41 AM IST

పోకో ఎం4 ప్రొ 5జి ఫస్ట్ సేల్ సందర్భంగా నేడు ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించనుంది. ఈ ఫోన్ గత ఏడాది జూన్‌లో ప్రారంభించిన పోకో ఎం3 ప్రొ 5జికి అప్‌గ్రేడ్ వెర్షన్. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఇచ్చారు.
 


చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో ఇండియా  పోకో ఎం4 ప్రొ5జి (poco M4 Pro 5G)ని గత వారం ఇండియాలో మాత్రమే ఆవిష్కరించింది. అయితే ఈ రోజు అంటే ఫిబ్రవరి 22న పోకో ఎం4 ప్రొ5జి  ఫిస్ట్ సెల్ ప్రారంభంకానుంది. దీనిని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి విక్రయించనుంది. ఈ ఫోన్ గత ఏడాది జూన్‌లో లాంచ్ చేసిన పోకో ఎం3 ప్రొ 5జికి  అప్‌గ్రేడ్ వెర్షన్. పోకో ఎం4 ప్రొ 5జిలో MediaTek Dimensity 810 ప్రాసెసర్ ఇచ్చారు. అంతేకాకుండా 33W ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ కూడా ఇందులో  ఉంటుంది. భారత మార్కెట్లో పోకో ఎం4 ప్రొ 5జి వివో టి1 5జి, రియల్ మీ నార్జో 30 ప్రొ, ఒప్పో ఏ4 5జి, లవ అగ్ని 5జి వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది.

 ధర
పోకో ఎం4 ప్రొ 5జి 4 GB RAM అండ్ 64 GB స్టోరేజ్ ధర రూ. 14,999. 6 జీబీ ర్యామ్‌తో కూడిన 128 జీబీ స్టోరేజ్ ధరను రూ.16,999గా ఉంచగా, 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.18,999గా నిర్ణయించారు. పోకో ఎం4 ప్రొ 5జిని కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Latest Videos

undefined

స్పెసిఫికేషన్‌లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 దీనిలో అందించారు. ఇంకా త్వరలో MIUI 13 అప్ డేట్ కూడా పొందుతుంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డాట్ నాచ్ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేతో పాటుగా DCI-P3 వైడ్ కలర్ గోమాట్, మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 8GB వరకు LPDDR4X RAM, 128GB వరకు స్టోరేజ్ ఉంటుంది. 8 GB డైనమిక్ RAM ఫోన్‌తో అందుబాటులో ఉంటుంది.

కెమెరా
పోకో  ఈ ఫోన్‌లో డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ ఇచ్చింది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాతో సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా కెమెరాతో నైట్ మోడ్ కూడా లభిస్తుంది. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్  కెమెరా ఇవ్వబడింది.

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, NFC, FM రేడియో, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇంకా 33W ప్రో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 195 గ్రాములు.

click me!