Whatsapp Update:డిసపియర్ ఫీచర్‌లో పెద్ద మార్పు, మెసేజ్ తొలగించిన తర్వాత కూడా చూడవచ్చు..

By asianet news telugu  |  First Published Jul 25, 2022, 11:28 AM IST

వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp డిసపియర్ Kept Messages ఫీచర్‌పై పని చేస్తోంది, దీంతో  మెసేజెస్ అదృశ్యమైన తర్వాత కూడా కనిపిస్తుంది.


ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ల గురించి కొంతకాలంగా చర్చ జరుగుతుంది. వాట్సాప్‌ కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌ల గురించి ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ కూడా ఈ ఫీచర్ల అభివృద్ధిపై నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పుడు వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది, ఏంటంటే యూజర్లు అదృశ్యమవుతున్న మెసేజెస్(Disappearing messages) ఎప్పుడైనా చూడవచ్చు. ఇంతకుముందు యూజర్ల  మెసేజెస్ డిసపియర్ కావడానికి 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులు ఆప్షన్ ఉండేది. కానీ ఈ కొత్త ఫీచర్ తర్వాత మెసేజ్ ఎప్పటికీ డిలెట్ కావు. 

వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp డిసపియర్ Kept Messages ఫీచర్‌పై పని చేస్తోంది, దీంతో మెసేజ్ డిసపియర్ అయిన తర్వాత కూడా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అండ్ వాట్సాప్ డెస్క్‌టాప్ కోసం వాట్సాప్ ఈ డిసపియర్ కెప్ట్ మెసేజెస్ ఫీచర్‌ను విడుదల చేస్తుంది. ఈ ఫీచర్ తర్వాత, వినియోగదారులు డిసపియర్ మోడ్‌లో చేసిన మెసేజెస్ డిలెట్ అయిన తర్వాత కూడా చూడగలరు.

Latest Videos

undefined

WhatsApp  ఈ కొత్త ఫీచర్‌కి Kept Messages అని పేరు పెట్టింది. వినియోగదారులందరూ  చాట్ లో Kept మెసేజెస్ ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, మరిన్ని మార్పులను ఇందులో చూడవచ్చు. 

యూజర్ నోటిఫికేషన్ లేకుండా కూడా
Kept Messagesతో WhatsApp కూడా సైలెంట్ లీవ్ గ్రూప్ ఆప్షన్‌పై పని చేస్తోంది. ఒక యూజర్ గ్రూప్ నుండి డిలెట్ అయిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ పంపదు, గ్రూప్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ నుండి వెళ్ళిపోయిన వారి సమాచారాన్ని పొందవచ్చు.  

click me!