కూల్‌ప్యాడ్ తమ బ్రాండ్ నుంచి సిరీస్‌ను అప్‌డేట్ చేస్తూ Coolpad Cool 20s అనే సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ లోని ఫీచర్లు, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
చైనీస్ మొబైల్ తయారీదారు కూల్‌ప్యాడ్ తాజాగా Coolpad Cool 20s అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కూల్‌ప్యాడ్ కంపెనీ గతేడాది మేలో కూల్‌ప్యాడ్ కూల్ 20ని విడుదల చేసింది, ఆ తర్వాత నవంబర్ కూల్‌ప్యాడ్ కూల్ 20 ప్రోని విడుదల చేసింది. తాజాగా విడుదలైన ఫోన్ ఈ సిరీస్‌లో మూడవది. అయితే తాజాగా వచ్చిన Coolpad Cool 20s స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్ కాబట్టి ధర కూడా అందుబాటులోనే ఉంటుంది.
Coolpad Cool 20s బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మెరుగ్గా ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ సీపీయూ అలాగే ఫాస్ట్ ఛార్జింగ్‌తో మెరుగైన బ్యాటరీ ప్యాక్, స్క్రీన్ పైన వాటర్ డ్రాప్ నాచ్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉండటం ప్రధాన ఆకర్షణలు. సాఫ్ట్‌వేర్ వారీగా ఫోన్ పైన కూల్ OS 2.0 లేయర్‌తో Android 11ని బూట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్లలోని ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషలు ఎలా ఉన్నాయో చూడండి.
కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ ధర
కూల్‌ప్యాడ్ కూల్ 20ఎస్ 5జీ ధర చైనాలో 999 యువాన్ల (సుమారు రూ.11,500) నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన సేల్ జూన్ 17వ తేదీ నుంచి జరగనుంది. 4 జీబీ ర్యామ్, 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. అజూర్ బ్లూ, ఫైర్‌ఫ్లై బ్లాక్ మూన్, షాడో వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. కూల్‌ప్యాడ్ బ్రాండ్ మనదేశంలో ఒకప్పుడు చాలా ఫేమస్ కాబట్టి ఈ ఫోన్ కూడా మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Coolpad Cool 20s స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
- 4GB/6GB/8GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్
- వెనుకవైపు 50+2 డ్యుఎల్ క్యామ్ సెటప్, ముందువైపు 8 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
- 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జింగ్ బ్యాటరీ. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనేది కంపెనీ వెల్లడించలేదు.