ప్రముఖ కంపెనీ Vivo ఈ రోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో రాబోయే వారంలో కొత్త VIVO T3 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo ఈ రోజు (మార్చి 15) Vivo T3 5G స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ చేయబడుతుందని వెల్లడించింది. అలాగే భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ఉంటుందని తెలిపింది. కొత్త Vivo T3 5G MediaTek డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్‌పై రన్ అవుతుందని, ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ కూడా ఉన్నట్లు తెలిపింది.
Vivo T3 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ మార్చి 21న మధ్యాహ్నం 12:00 PM ISTకి లాంచ్ అవుతుందని Vivo మీడియా కాల్ ద్వారా ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ఈ హ్యాండ్‌సెట్ కోసం కొత్త మైక్రోసైట్‌ను సెటప్ చేసింది, డిజైన్ అండ్ స్పెసిఫికేషన్‌లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా వెల్లడించనుంది.
undefined
Vivo T3 5G బ్లూ కలర్‌లో లభిస్తుంది ఇంకా LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు చూపించింది. కెమెరా యూనిట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో సోనీ సెన్సార్ ఉంది. భారతదేశంలో Vivo T3 5G ధర దాదాపు రూ. 20,000 ఉండవచ్చని అంచనా. క్రిస్టల్ ఫ్లేక్ అండ్ కాస్మిక్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంటుంది.
లీక్ ప్రకారం, Vivo T3 5G 6.67-అంగుళాల పూర్తి-HD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో అలాగే 1,800 నిట్‌ల వరకు పిక్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. 8GB RAM అండ్ 128GB RAM అలాగే 256GB స్టోరేజ్ అప్షన్స్ లో వస్తుందని చెప్పబడింది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌ను కూడా అందించగలదు.