పగటిపూట చీకటి ! 50 ఏళ్లలో తొలిసారిగా ఇలాంటి స్కై వ్యూ! ఎప్పుడంటే..?

Published : Mar 15, 2024, 11:07 AM ISTUpdated : Mar 15, 2024, 11:08 AM IST
 పగటిపూట చీకటి ! 50 ఏళ్లలో తొలిసారిగా ఇలాంటి స్కై వ్యూ!  ఎప్పుడంటే..?

సారాంశం

ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఎక్కడో ఒకచోట సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే 2024 సూర్యగ్రహణం మాత్రం చాల ప్రత్యేకం.   

2024 సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ 8న  చోటు  చేసుకోనుంది. చంద్రుడు సూర్యుడికి ఇంకా  భూమికి మధ్య సరళ రేఖ(straight line)లో వచ్చినప్పుడు అప్పుడు పగలు రాత్రిలా కనిపిస్తుంది. ఈసారి ఉత్తర అమెరికా, సెంట్రల్  అమెరికాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది 50 సంవత్సరాలలో సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం అని అంచనా వేయబడింది.

ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఎక్కడో ఒకచోట సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ సగటున సంపూర్ణ సూర్యగ్రహణం ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఒక ప్రాంతంలో సంభవిస్తుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసి కరోనల్ రింగ్ అని పిలువబడే సూర్యుని బయటి వలయం మాత్రమే కనిపించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించిందని చెప్పవచ్చు. అంటే పగలు సంధ్యాకాలంల  కనిపిస్తుంది. ఇంకా ఆ రోజు పగటిపూట నక్షత్రాలను చూడగలరు. 

అయితే ఏప్రిల్ 8న రానున్న సూర్యగ్రహణం ప్రత్యేకం. ఇది 7.5 నిమిషాల వరకు ఉంటుందని లెక్కించబడుతుంది. గత 50 ఏళ్లలో ఇదే ఎక్కువ సమయం ఉన్న సూర్యగ్రహణం అని కూడా నమ్ముతారు. అది అరుదైన సుదీర్ఘ కాలం. పసిఫిక్ మహాసముద్రంలో 2150లో  సుదీర్ఘమైన సూర్యగ్రహణం కనిపిస్తుంది. అంటే మరో 126 ఏళ్లు వేచి చూడాల్సిందే.

మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ అండ్  కెనడా వంటి దేశాలు ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడగలవు. దాదాపు 32 మిలియన్ల మంది సూర్యుని కరోనల్ రింగ్‌ని చూడగలరు. అయితే సూర్యగ్రహణం సమయంలో సూర్యుని వైపు నేరుగా చూడవద్దని, ప్రత్యేక సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్‌ని ఉపయోగించాలని నిపుణులు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?
Realme C85 5G: అర గంట నీటిలో ఉన్నా ఈ ఫోన్‌కి ఏం కాదు.. ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఈ ఫీచ‌ర్లేంటీ భ‌య్యా