దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల(national highway)పై ప్రయాణించేటప్పుడు జరిమానాలు ఇంకా డబుల్ టోల్‌లను నివారించాలని ఈ మార్పు సూచించబడింది.
Paytm పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన Fastag యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక ముఖ్యమైన సలహాను జారీ చేసింది. నేషనల్ హైవేస్ ఆఫ్ అథారిటీ Paytm ఫాస్టాగ్ యూజర్లకు మార్చి 15 లోపు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్టాగ్‌ని పొందాలని సూచించింది.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు ఇంకా డబుల్ టోల్‌లను నివారించాలని ఈ మార్పు సూచించబడింది.
Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ విధించిన నిషేధం కారణంగా నేషనల్ హైవేస్ ఆఫ్ అథారిటీ నుండి ఈ కొత్త సలహా బయటకు వచ్చింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఎలాంటి డిపాజిట్ చేయవద్దని కస్టమర్లకు సూచించింది.
RBI ఆదేశాల ప్రకారం ఇతర ఆథరైజేడ్ ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల నుండి ఫాస్ట్‌ట్యాగ్‌లను పొందవచ్చు. ఆర్‌బీఐ గడువు కంటే ముందే కొత్త ఫాస్టాగ్ అకౌంట్ పొందాలని హైవే అథారిటీ స్పష్టం చేసింది.
అయితే, ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉంటే, మీరు రిటర్న్ కోసం అడగవచ్చు. అయితే పేమెంట్స్ కోసం మాత్రమే వినియోగదారులు Paytm బ్యాంక్ ఖాతాలోని మిగిలిన Fastag బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. Paytm పేమెంట్ బ్యాంక్ వినియోగదారులకు ప్రత్యామ్నాయంగా 32 బ్యాంకులు Fastag ప్రొవైడర్లుగా ఆమోదించబడ్డాయి. Paytm వినియోగదారులు వీటిలో ఏదైనా ఒకదానికి మారవచ్చు.
ఫాస్టాగ్ జారీదారులుగా ఆమోదించబడిన 32 బ్యాంకుల లిస్ట్ క్రింద ఉంది.
బ్యాంక్ పేరు
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఆక్సిస్
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
కెనరా బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్
FINO పేమెంట్స్ బ్యాంక్
HDFC
IDBI బ్యాంక్
IDFC ఫస్ట్ బ్యాంక్
ఇండస్ఇండ్ బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్
నాగ్‌పూర్ నాగరిక్ సహకారి బ్యాంక్
సరస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్
సౌత్ ఇండియన్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
UCO బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
యస్ బ్యాంక్ లిమిటెడ్
ఇండియన్ బ్యాంక్