యూజర్లకు బంపర్ గిఫ్ట్, ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ పని చేస్తుంది!

By Ashok Kumar  |  First Published Jul 24, 2024, 9:19 AM IST

వాట్సాప్ ఇప్పుడు మరో బంపర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండా కూడా WhatsApp ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పని చేస్తుంది.
 


న్యూఢిల్లీ: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. అంతేకాదు వాట్సాప్ లేటెస్ట్  ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్  సపోర్ట్ కూడా అందించింది. అయితే తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ ఇంటర్నెట్ లేకుండా కూడా పని చేస్తుంది. దింతో  ఫోటో, వీడియో, ఫైల్ షేరింగ్ ఈజీగా సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు రాబోతుంది.

కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. ఈ ఫీచర్ త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఈ రోజుల్లో ఫోటోలు, వీడియోలు, ఫైల్‌లు ఇతరుల వాట్సాప్‌కు షేర్ చేయడానికి ఇంటర్నెట్ చాలా అవసరం. కానీ కొత్త ఫీచర్‌కి ఫైల్ షేరింగ్ కోసం ఇంటర్నెట్ అవసరం లేదు. మీ ఫోన్‌లో డేటా లేకపోయినా ఫైల్ షేరింగ్ సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉన్న వాట్సాప్ అకౌంట్ కు  ఇంటర్నెట్ లేకుండా కూడా ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెడుతోంది.

Latest Videos

కొత్త ఫీచర్ వల్ల హైక్వాలిటీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను ఇంటర్నెట్ లేకుండా పక్కనే ఉన్న వాట్సాప్ అకౌంట్ ఫోన్ కు షేర్ చేయడం ఈజీ అవుతుంది. ఇది మాత్రమే కాదు ఫోటోలు, వీడియోలు ఒకే క్వాలిటీలో షేర్ అవుతాయి. ఎంత పెద్ద సైజు ఫైళ్లను ఇంటర్నెట్ లేకుండా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఐఫోన్‌లో ఎయిర్‌డ్రాప్ ఫీచర్ తరహాలో ఈ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. 

ఈ ఫీచర్‌తో ఇంటర్నెట్‌తో లేదా లేకుండా కూడా ఫైల్‌లను షేర్ చేయడానికి మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది మీ సమీపంలోని WhatsApp అకౌంట్ కు  ఫైల్స్ షేర్ చేయగలదు. క్యూర్ కోడ్‌ని స్కాన్ చేసి, షేర్ చేయాల్సిన ఫైల్‌ని సెలెక్ట్ చేసుకొని  దాన్ని పంపండి. అదే క్వాలిటీ, అదే సైజ్ ఫైల్ షేర్  అవుతుంది. కొత్త ఫీచర్ యూజర్లకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది.

గతంలో, బ్లూటూత్ ద్వారా ఫైల్‌లను షేర్ చేయడానికి షేర్ ఇట్ ఉపయోగించారు. దీని డెవలప్ చేసిన వెర్షన్ ఇప్పుడు వాట్సాప్ అందిస్తోంది.

click me!