బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్...5 జిబి డేటాతో వాయిస్ కాలింగ్‌

By Sandra Ashok Kumar  |  First Published Dec 20, 2019, 4:07 PM IST

 90 రోజుల వాలిడిటీతో  "మిత్రామ్ ప్లస్" అనే కొత్త రూ.109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ బి‌ఎస్‌ఎన్‌ఎల్  ప్రవేశపెట్టింది. బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 109  ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 5 జిబి డేటాతో పాటు 250 నిమిషాల డేలీ వాయిస్ కాలింగ్‌ను అందించే విధంగా రూపొందించారు.


భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఇప్పుడు 90 రోజుల వాలిడిటీతో  "మిత్రామ్ ప్లస్" అనే కొత్త రూ.109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్  ప్రవేశపెట్టింది. బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 109  ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 5 జిబి డేటాతో పాటు 250 నిమిషాల డేలీ వాయిస్ కాలింగ్‌ను అందించే విధంగా రూపొందించారు.

also read ఆన్ లైన్ లో చైనా కొత్త స్మార్ట్ ఫోన్... ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే

Latest Videos

కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న (రూ.49, రూ. 40, 500 ఎమ్‌బి డేటా, 15 రోజుల వాలిడిటీ) మిత్రం ప్లాన్లతో పాటు అందుబాటులో ఉండనుంది.బిఎస్‌ఎన్‌ఎల్ కేరళ వెబ్‌సైట్‌  లిస్టింగ్ ప్రకారం రూ. 109 "మిత్రామ్ ప్లస్" ప్లాన్ ముంబై మరియు ఢిల్లీ సర్కిల్‌లతో సహా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ తో పాటు 5 జిబి డేటా  కూడా వస్తుంది.

వినియోగదారులు ఆన్-నెట్ లోకల్, ఎస్టీడీ కాల్స్ కోసం సెకనుకు 1.2 పైసలు వసూలు చేస్తారు. అయితే ఆఫ్-నెట్ లోకల్ ఇంకా ఎస్టిడి కాల్స్ సెకనుకు 1.5 పైసలు  వసూలు చేస్తారు. ఇంకా లోకల్ ఆన్-నెట్ జాతీయ ఎస్‌ఎం‌ఎస్ లకు 70 పైసలు, ఆఫ్-నెట్ ఎస్‌ఎం‌ఎస్ లకు ప్రతి ఎస్‌ఎం‌ఎస్ కి 80 పైసల చార్జ్ చేయనుంది.

also read అమెజాన్ ఇండియాలో ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’

 కొత్త రూ. 109 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజుల వరకు వ్యాలిడిటీ చెందుతుంది. ఈ ప్లాన్ ప్రస్తుతం కేరళ సర్కిల్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.అయితే  కేరళ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్‌ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మిగతా సర్కిళ్లకు త్వరలోనే రీఛార్జ్  ప్లాన్‌ను తీసుకురానుంది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు.


 

click me!