boAt ఎలక్ట్రానిక్ సంస్థ తమ బ్రాండ్ నుంచి 'boAt Wave Lite' పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను తాజాగా విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ. 1,999గా నిర్ణయించారు. గురువారం నుంచి ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.
ఇయర్ ఫోన్లు, స్పీకర్ల ఉత్పత్తులలో పేరుగాంచిన boAt ఎలక్ట్రానిక్ సంస్థ తమ బ్రాండ్ నుంచి 'boAt Wave Lite' పేరుతో సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను తాజాగా విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ. 1,999గా నిర్ణయించారు. మరి ఈ స్మార్ట్‌వాచ్‌లో ఎలాంటి ఫీచర్లతో వచ్చింది, దీనిలోని ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం.
ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్ రేట్ తెలుసుకోవచ్చు, అలాగే ఆక్సిజన్ స్థాయిలను నిర్ధారించే SpO2 ట్రాకింగ్ సహా మిగతా రోజువారీ కార్యకలాపాలను అన్నింటినీ ట్రాక్ చేయడానికి సుమారు 10 రకాల స్పోర్ట్స్ మోడ్‌లను కలిగిఉంది. ఫుట్‌బాల్, యోగా, సైక్లింగ్, వాకింగ్, బ్యాడ్మింటన్, వాకింగ్, రన్నింగ్, బాస్కెట్‌బాల్, స్కిప్పింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్ ఇలా మీరు చేసే ప్రతిపనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ స్మార్ట్‌వాచ్ అందిస్తుంది. ఇది Google Fit యాప్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ స్మార్ట్‌వాచ్‌తో వినియోగదారులు తమ ఫోన్ కెమెరా, మ్యూజిక్ ప్లేలిస్ట్‌ను కూడా నియంత్రించగలరు.
boAt Wave Lite స్మార్ట్‌వాచ్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యం కలిగినది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే వారంరోజుల పాటు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. డిజైన్ పరంగా boAt Wave Lite స్మార్ట్‌వాచ్ 1.69-అంగుళాల చతురస్రాకార డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 500నిట్‌ల బ్రైట్నెస్ అలాగే 70 శాతం RGB కలర్ రేంజ్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌వాచ్ నలుపు, నీలం, ఎరుపు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. boAt అధికారిక వెబ్ సైట్ ద్వారా వినియోగదారులు ఈ వాచ్‌కు 100 రకాల ఫేస్ డిజైన్స్ కూడా పొందవచ్చునని కంపెనీ తెలిపింది. మార్చి 31 నుంచి అమెజాన్ లో బోట్ వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉండనుంది.