Google Pay: గూగుల్‌ పే యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇక ట్రాన్సాక్ష‌న్లు ఈజీ..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 31, 2022, 12:20 PM IST
Google Pay: గూగుల్‌ పే యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇక ట్రాన్సాక్ష‌న్లు ఈజీ..!

సారాంశం

గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్. యూపీఐ పేమెంట్ల కోసం గూగుల్ పే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.  మరింత సులువుగా లావాదేవీలను జరిపేందుకుగాను ‘ట్యాప్‌ టూ పే’ సేవలను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.   

యూపీఐ సేవల్లో భాగంగా 'ట్యాప్ టు పే' ఫీచర్‌ కోసం ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పైన్ ల్యాబ్స్‌తో గూగుల్‌ పే జతకట్టింది. దీంతో యూజర్లు తమ కార్డ్‌లను ఉపయోగించకుండా యూపీఐ ద్వారా సజావుగా చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ కేవలం డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. పైన్ ల్యాబ్స్ రూపొందించిన ఆండ్రాయిడ్ పీఓఎస్‌ టెర్మినల్‌ని ఉపయోగించి లావాదేవీలను గూగుల్‌ పే యూజర్లు చేయవచ్చును.  నీయర్‌ టూ ఫీల్డ్‌(ఎన్‌ఎఫ్‌సీ) పేమెంట్స్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉండే అన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్‌, స్టార్‌బక్స్, ఫ్యూచర్ రిటైల్ వంటి ఇతర పెద్ద వ్యాపారులకు అందుబాటులోకి వచ్చింది. 

ట్యాప్‌ టూ పే ఫీచర్‌తో యూపీఐ పేమెంట్స్‌ మరింత తక్కువ సమయంలో జరుగుతాయని గూగుల్‌ పే బిజినెస్‌ హెడ్‌ సశిత్‌ శివానందన్‌ అన్నారు. అంతేకాకుండా అవుట్‌లెట్లలో, క్యూ మేనేజ్‌మెంట్ అవాంతరాలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. గూగుల్‌ పేతో భాగస్వామిగా పైన్‌ ల్యాబ్స్‌ ఉన్నందుకు సంతోషిస్తున్నామని పైన్‌ ల్యాబ్స్‌ బిజినెస్‌ చీఫ్‌ ఖుష్‌ మెహ్రా అన్నారు.  భారత్‌లో కాంటక్ట్‌లెస్‌ పేమెంట్స్‌ను అందించేందుకు పైన్‌ ల్యాబ్స్‌ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. 

UPI ఫంక్షనాలిటీతో పనిచేసే పీఓఎస్ టెర్మినల్స్‌పై ట్యాప్ చేయడం ద్వారా యూజర్లు తమ ఫోన్‌ను PoS టెర్మినల్‌లో ట్యాప్ చేసుకోవచ్చు. తద్వారా ఈజీగా లావాదేవీలను చేసుకోవచ్చు. UPI పిన్‌ ద్వారా ఫోన్ నుంచి పేమెంట్లను చేసుకోవచ్చు. QR కోడ్‌ స్కాన్ చేయాల్సిన పనిలేదు. UPI-లింక్ చేసిన మొబైల్ నంబర్‌‌తో అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్‌లో NFC సపోర్టు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. Apple Pay కాకుండా ఇతర సర్వీసుల ద్వారా NFC ఆధారిత పేమెంట్లను Apple సపోర్టు చేస్తుంది. Android ఫోన్‌లకు లిమిట్ వర్తిస్తుంది.

UPI పేమెంట్ల కోసం ట్యాప్ చేయడం ద్వారా అధిక ట్రాఫిక్ రిటైల్ అవుట్‌లెట్‌లకు అనేక సమస్యలు ఉన్నాయి. క్యూ నిర్వహణ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. కార్డ్‌లకు మించి POSలో డిజిటల్ పేమెంట్లను చేసుకోవచ్చు అని Google Pay నెక్స్ట్ బిలియన్ యూజర్ ఇనిషియేటివ్‌ల బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ అన్నారు.

PREV
click me!

Recommended Stories

Best Camera Phones : 2025లో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే
Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే