అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో బోట్ స్టోన్ 700A ను విడుదల చేసింది. అయితే ఇది రూ. 3,499 ధరకు లభిస్తుంది. కొత్త బోట్ స్టోన్ 200A IPX6 రేట్ చేయబడింది. ఇది వాటర్, షాక్, దుమ్ము నుండి రెసిస్టంట్ కలిగి ఉంటుంది.
బోట్ కంపెనీ బోట్ స్టోన్ 200A అనే కొత్త స్పీకర్‌ను విడుదల చేసింది. అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో బోట్ స్టోన్ 700A ను విడుదల చేసింది. అయితే ఇది రూ. 3,499 ధరకు లభిస్తుంది. కొత్త బోట్ స్టోన్ 200A IPX6 రేట్ చేయబడింది. ఇది వాటర్, షాక్, దుమ్ము నుండి రెసిస్టంట్ కలిగి ఉంటుంది.
కొత్త బోట్ స్టోన్ స్పీకర్ అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ ఇంటర్నల్ ఇంబిల్ట్ తో వస్తుంది. ఇది పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్ కోసం చూస్తున్న వారికి సరసమైన చాయిస్ అని చెప్పాలి. బోట్ స్టోన్ 200A ధర రూ. 1,499 వద్ద లభిస్తుంది. మార్కెట్లో ఇది అలెక్సాతో పనిచేసే బ్లూటూత్ స్పీకర్లలో ఒకటిగా నిలిచింది.
also read హెచ్‌పి నుంచి కొత్త 10th జెన్ ల్యాప్టాప్....తక్కువ ధరకే...
బోట్ స్టోన్ 200A ఫీచర్స్
బోట్ స్టోన్ 200A కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది. ధృడమైన ఎక్స్ టర్నల్, IPX6 రేట్, 3W అవుట్‌పుట్‌తో 1.96-అంగుళాల ఫుల్ రేంజ్ డ్రైవర్‌ను కలిగి ఉంది. ఇది 180Hz-20KHz ఫ్రీక్వెన్సీ, 4 ఓంల ఇంపెడెన్స్ కలిగి ఉంది. దీని సైజ్ 96.5x88x49mm దీని బరువు 240 గ్రాములు.
కనెక్టివిటీ కోసం పోర్టబుల్ స్పీకర్ బ్లూటూత్ 4.1, ఛార్జింగ్ కోసం ఆక్స్ పోర్ట్ ఇంకా యుఎస్బి పోర్ట్స్ కూడా ఉన్నాయి. బోట్ స్టోన్ 200A 1500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. బోట్ 8 నుండి 10 గంటల వరకు ప్లేబ్యాక్‌ను క్లెయిమ్ చేస్తుంది. స్పీకర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3గంటలు పడుతుంది.
also read ఫోన్‌పే యాప్ ద్వారా ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో తెలుసా...?
బోట్ స్టోన్ 200A పై 5 బటన్లు ఉంటాయి. వీటిలో మ్యూజిక్ ప్లేబ్యాక్, వాల్యూమ్ కంట్రోల్స్, మల్టీఫంక్షన్ కీ ఉంటాయి. యూజర్లు బోట్ లైఫ్ స్టైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలెక్సా ఫుల్ ఫీచర్స్ కోసం వినియోగదారులు అమెజాన్ అలెక్సా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్పీకర్ సెటప్ చేసిన తర్వాత వినియోగదారులు వాయిస్ ద్వారా అలెక్సాను ఉపయోగించుకోవచ్చు.