WhatsApp Big update:ఇప్పుడు ఒకేసారి 32 మందితో గ్రూప్ కాల్స్.. కొత్త డిజైన్, మార్పులు ఇవే..

By asianet news telugu  |  First Published Apr 25, 2022, 11:35 AM IST

వాట్సాప్ గతంలో గ్రూప్ కాలింగ్  ఫీచర్ 4 నుంచి 8కి పెంచింది. ఇప్పుడు కొత్త అప్‌డేట్‌తో కొత్త డిజైన్ కూడా వెల్లడైంది. దీంతో పాటు స్టిక్కర్ల ప్లేస్ కూడా మార్చారు.


మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఒక మేజర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. కొత్త అప్‌డేట్ తర్వాత వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్‌లో ఏకకాలంలో 32 మందితో గ్రూప్ కాల్స్ చేయవచ్చు,  మాట్లాడవచ్చు. కొత్త ఫీచర్ వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్‌కి ఎక్స్ టెంట్. వాట్సాప్ గతంలో గ్రూప్ కాలింగ్ ఫీచర్ 4 నుంచి 8కి పెంచిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కొత్త అప్‌డేట్‌తో కొత్త డిజైన్ కూడా కనిపించింది. దీంతోపాటు స్టిక్కర్ల ప్లేస్ కూడా మార్చారు. కొత్త అప్‌డేట్‌తో మిస్సింగ్ మెసేజ్‌లను సేవ్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

WhatsApp  32 వ్యక్తుల గ్రూప్ కాల్ ఫీచర్‌లను iPhone వెర్షన్ v22.8.80, Android వెర్షన్ v2.22.9.73లో చూడవచ్చు. WhatsApp v22.8.80 ఐఫోన్ కోసం కొత్త అప్‌డేట్‌  యాప్ స్టోర్‌లో విడుదల చేసింది. ఈ వెర్షన్‌తో స్పీకర్ హై-లైట్, వాయిస్ మెసేజ్‌ల విజువలైజేషన్, స్టిక్కర్‌లు అప్‌డేట్ చేయబడతాయి. వాట్సాప్ గత వారమే ఈ ఫీచర్లన్నింటినీ ప్రకటించింది. అయితే మేడ్ ఇన్ ఇండియా యాప్ టెలిగ్రామ్‌లో గ్రూప్ కాల్‌లకు లిమిట్ లేదు.

Latest Videos

undefined

WABetaInfo ఈ అన్ని కొత్త ఫీచర్ల గురించి సమాచారాన్ని అందించింది. ఈ ఫీచర్లన్నీ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే ఉన్నాయి. కొత్త అప్‌డేట్‌తో స్టేటస్ కోసం కొత్త ప్రైవసీ ఫీచర్ కూడా  ఉంటుంది. కొత్త అప్‌డేట్ తర్వాత వినియోగదారులు వారి ఫోటోలను స్టిక్కర్‌ల కోసం కూడా ఉపయోగించవచ్చు.

ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ v2.22.10.9తో గతం కంటే ఎక్కువ ఎమోజి, ఎమోజి రియాక్షన్ కోసం ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. iOS v22.9.0.70 బీటా వెర్షన్‌తో ప్రైవసీ కోసం లేటెస్ట్ ఫీచర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. రెండు యాప్‌ల కొత్త అప్‌డేట్‌తో WhatsApp యాప్ డిజైన్, ఇంటర్‌ఫేస్‌లో కూడా మార్పులు కనిపిస్తాయి.
 

click me!