ఆసుస్ జెన్ బుక్ 13ఎస్ ఫ్లిప్ ఓఎల్‌ఈడిలో కంపెనీ ఏఎండి రైజెన్ అండ్ జెన్‌బుక్ ప్రో 15 ఫ్లిప్ ఓఎల్‌ఈడిలో 12th జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అందించింది.
తైవాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్(Asus)జెన్‌బుక్ ఎస్13 ఫ్లిప్ ఓఎల్‌ఈడి(Asus Asus Zenbook S 13 OLED), జెన్‌బుక్ ప్రో 15 ఫ్లిప్ ఓఎల్‌ఈడి(Zenbook Pro 15 Flip OLED)లను విడుదల చేసింది. ఈ రెండూ కంపెనీ జెన్‌బుక్ సిరీస్ క్రింద ప్రవేశపెట్టారు. ఈ ల్యాప్‌టాప్‌ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే వీటిని ప్రస్తుతానికి యూఎస్ లో లాంచ్ చేశారు. ఈ రెండు ల్యాప్‌టాప్‌ల ఫీచర్ల గురించి..
జెన్‌బుక్ ఎస్13 ఫ్లిప్ ఫీచర్స్
అసుస్ జెన్‌బుక్ ఎస్13 ఫ్లిప్ 2.8K OLED డిస్‌ప్లే, 0.2ms రెస్పాన్స్ టైమ్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 16:10, బ్రైట్‌నెస్ 550 నిట్స్. డిస్ ప్లే సైజ్ 13.3 అంగుళాలు. ఈ నోట్‌బుక్ డిస్‌ప్లే DCI-P3 కలర్ గాముట్(gamut) సపోర్ట్ ఇస్తుంది. డిస్ ప్లే పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే ఈ ల్యాప్‌టాప్ 32జిబి వరకు LPDDR5 ర్యామ్, 1TB వరకు PCIe SSD స్టోరేజ్ ప్యాక్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో AMD Ryzen 5 6600U ప్రాసెసర్ ఇచ్చారు. మరోవైపు, బ్యాటరీ గురించి మాట్లాడితే ఈ ల్యాప్‌టాప్‌లో 67Whr బ్యాటరీ అమర్చారు, ఇంకా ఈ బ్యాటరీ 10 గంటల వరకు బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. కనెక్టివిటీ పరంగా 2 x థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, 1x HDMI 2.0 పోర్ట్, Wi-Fi 6E ఉంది. అలాగే మూడు USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి, వాటిలో ఒకటి ఛార్జింగ్ కోసం ఇచ్చారు.
జెన్‌బుక్ ప్రో 15 ఫ్లిప్ ఓఎల్‌ఈడి ఫీచర్స్
మీరు ఈ ల్యాప్‌టాప్‌ను టాబ్లెట్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ నోట్‌బుక్‌లో 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7-12700H ప్రాసెసర్ ఇచ్చారు. గరిష్టంగా 16GB వరకు LPDDR5 ర్యామ్, 1TB వరకు NVMe M.2 SSD స్టోరేజ్ ఉంది. అలాగే 15.6-అంగుళాల 2K OLED డిస్ ప్లే ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే ఈ ల్యాప్‌టాప్‌లో 67Whr బ్యాటరీ కూడా ఉంది, ఇంకా ఒకే ఛార్జ్‌లో 10 గంటల బ్యాకప్ ఇస్తుంది. కనెక్టివిటీ పరంగా, డివైజ్ లో రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, ఒక HDMI 2.0 పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ అండ్ Wi-Fi 6e సపోర్ట్ ఉన్నాయి. సింగిల్-జోన్ RGB కీబోర్డ్, PEN 2.0 సపోర్ట్, ఫేషియల్ రికగ్నిషన్ కోసం IR కెమెరాతో వస్తుంది. నోట్‌బుక్‌లో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ వంటి కొన్ని ఆడియో ఫీచర్‌లు కూడా ఉన్నాయి.