ఐఫోన్ తాజాగా మరో సేఫ్టీ ఫీచర్‌ను తీసుకోచ్చింది, నూడ్ గా ఉన్న ఫొటోలను షేర్ చేస్తే వాటిని బ్లర్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకత.
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఫోన్‌కు ఉన్న క్రేజీ గురించి అందరికి తెలిపిందే. పకడ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారుల సేవలు అందిస్తున్న ఐఫోన్ తాజాగా మరో సేఫ్టీ ఫీచర్‌ను తీసుకోచ్చింది, ఇది పిల్లలు వాడే యాపిల్ డివైజ్‌లలో అశ్లీల ఫోటోలు వచ్చిన లేదా పంపడానికి ప్రయత్నిస్తే ఈ ఫీచర్ హెచ్చరిస్తుంది. అంతే కాకుండా అలాంటి ఫోటోలను నియంత్రించడానికి ఈ ఫీచర్ సహాయం చేస్తోంది. అశ్లీలతకు సంబంధించిన సందేశాన్ని షేర్ చేస్తే వాటిని బ్లర్ చేయడం కాకుండా.. చిత్రం సున్నితంగా ఉండవచ్చనే హెచ్చరికను ప్రదర్శిస్తుంది, అలాగే సహాయం కోరమని కూడా వినియోగదారులను కొరుతుంది. దానికి అనుసరించాల్పిస పద్ధతులను కూడా వివరించింది.
పిల్లలు వాడే ఐఫోన్ ప్రోడక్ట్స్‌లో పెద్దలు ఈ ఫీచర్‌ను ఆప్ట్ ఇన్ చేసి వారు అశ్లీల ఫొటోలు చూడకుండా చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో ఆ ఫోటలను నియంత్రించవు. వారు చూడాలనుకుంటే ఈజీగానే ట్యాప్ చేయవచ్చు. అయితే ఫోటోలు ఓపెన్ ‘ఈ ఫొటో సున్నితమైనది. అయినప్పటకీ మీరు చూడాలనుకుంటున్నారా’ అనే హెచ్చరిక సందేశాన్ని ప్రదర్శిస్తోంది. తర్వాత ఐయామ్ ష్యూర్ అని సెలక్ట్ చేసుకుంటే ఆ ఫొటోలు బ్లర్ లేకుండా కనిపిస్తాయి.
స్క్రీన్ టైమ్ ఫీచర్‌కి నావిగేట్ చేయడం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల ఐఫోన్‌లలో కమ్యూనికేషన్ సేఫ్టీని సెటప్ చేయవచ్చు. మెషీన్ లెర్నింగ్ సహాయంతో ఈ ఫీచర్ పనిచేస్తోంది. కంటెంట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తుందని Apple తెలిపింది. ఇది షేర్ చేసే యూజర్లు మినహా ఆ కంటెంట్ మరెవరూ చూడడకుండా చేస్తోందని సంస్థ యాపిల్ పేర్కొంది.