వాట్సాప్‌ నుంచి మరో అదిరిపోయే కొత్త అప్‌డేట్ !

By Ashok kumar SandraFirst Published Apr 19, 2024, 3:47 PM IST
Highlights

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా మరొక ఫీచర్ తీసుకురావడానికి సిద్ధమైంది.

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా మరొక ఫీచర్ తీసుకురావడానికి సిద్ధమైంది. సాధారణంగా వాట్సాప్ యూజర్లు ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉన్నారా? లేదా? అని తెలుసుకోవడానికి, వారి ప్రొఫైల్‌ను చూస్తారు. ఇలా ప్రతి ఒక్కరి ప్రొఫైల్ చెక్ చేసుకుంటూ వెళ్లడం సమయంతో కూడుకున్న పని. వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో ఈజీగా మీకు తెలుస్తుంది. WhatsApp ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో  ఉంది. 

నివేదిక ప్రకారం, వాట్సాప్ చాలా కాలంగా ఈ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్ పేరు "ఆన్‌లైన్ రీసెంట్‌"గా చెప్పబడుతోంది. ఆన్‌లైన్ రీసెంట్ ఫీచర్  ఆన్‌లైన్‌లో ఉన్న అన్ని కాంటాక్ట్స్  లిస్ట్ చూపుతుంది. అంతే కాకుండా, వాట్సాప్ మరొక ఫీచర్‌పై పని కూడా చేస్తోంది. 

వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ గురించి WABetaInfo సమాచారం ఇచ్చింది. రీసెంట్  గా  ఆన్‌లైన్‌లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ చూడగలిగే కొత్త ఫీచర్ స్క్రీన్‌షాట్ కూడా వెల్లడైంది. ఈ కొత్త ఫీచర్   ప్రయోజనం ఏమిటంటే కాంటాక్ట్స్ లో ఎవరు ఆన్ లైన్లో ఉన్నారో లేదో మీరు ముందుగానే తెలుసుకుంటారు ఇంకా  తదనుగుణంగా మీరు మెసేజెస్  పంపవచ్చు.

వాట్సాప్‌కి చాలా పెద్ద యూజర్‌బేస్ ఉంది. మెటా కింద వచ్చే ఈ యాప్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. కాగా, ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. రాబోయే కాలంలో, ఇన్‌స్టాగ్రామ్‌లో వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్  షేర్ చేసే అప్షన్  రానుంది.  

మెటా ఈ ఫీచర్‌పై పనిచేస్తోందని చాలా నివేదికలు తెలిపాయి. వాట్సాప్ అప్‌డేట్స్ పర్యవేక్షించే సంస్థ ప్రకారం, మీడియా షేరింగ్‌ను మెరుగుపర్చడానికి అంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్స్ షేర్ చేయడానికి మెటా ఒక ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. 
 

click me!