'ఇప్పటికి 30 ఏళ్ళు, ఇక మీ కంప్యూటర్లో ఇది కనిపించదు'; మైక్రోసాఫ్ట్ నిర్ణయం..

By Ashok kumar Sandra  |  First Published Apr 16, 2024, 6:34 PM IST

మైక్రోసాఫ్ట్ వర్డ్‌ప్యాడ్ 1995లో మైక్రోసాఫ్ట్ రైట్‌కు బదులుగా ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ప్రతి నెక్స్ట్ Windows అప్ డేట్ లో WordPad   నేటివ్  వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌గా ఉంది. WordPad ఫీచర్లను అందరికి ఉచితంగా అందించడం కూడా గమనించదగ్గ విషయం. 


విండోస్ అప్ కమింగ్ వెర్షన్ నుండి  WordPadని తీసివేయాలని Microsoft  నిర్ణయించింది. 30 ఏళ్ల WordPad ఒకప్పుడు యూజర్ల  మధ్య కొన్ని పనులను ఈజీ చేసింది. వ్రాయడం నుండి ఎడిట్ వరకు Wordpad ప్రతిదీ సులభం చేసింది. Microsoft నుండి రాబోయే Windows   తాజా వెర్షన్ Windows 12 నుండి WordPadని తొలగిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా తెలియజేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

మైక్రోసాఫ్ట్ వర్డ్‌ప్యాడ్ 1995లో మైక్రోసాఫ్ట్ రైట్‌కు బదులుగా ప్రవేశపెట్టారు. అప్పటి నుండి ప్రతి నెక్స్ట్ Windows అప్ డేట్ లో WordPad   నేటివ్  వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్‌గా ఉంది. WordPad ఫీచర్లను అందరికి ఉచితంగా అందించడం కూడా గమనించదగ్గ విషయం. కానీ చాలా కాలంగా ఈ యాప్‌కి ఎలాంటి కొత్త అప్‌డేట్‌లు రాలేదు. 

Latest Videos

undefined

అయితే నోట్‌ప్యాడ్ కొత్త అప్‌డేట్‌లను కూడా ప్రకటించింది. దీని తర్వాత వెంటనే, Microsoft Wordpad తీసివేయబడుతుందని ప్రకటించింది. MS Word వంటి  ప్రతి అప్ డేట్ ఫీచర్స్  Wordpadలో  రాలేదు. ఏదైనా సమాచారాన్ని టైప్ చేయడానికి  దాని ఫాంట్, సైజ్  మొదలైనవాటిని మార్చడానికి చాలా మంది Wordpadపై ఆధారపడతారు. అటువంటి నమ్మకమైన కస్టమర్లకు WordPad నష్టం మాటల్లో చెప్పలేనిది. నోట్‌ప్యాడ్‌లో చెప్పుకోదగ్గ ఎడిటింగ్ ఏమీ చేయలేకపోవడం కూడా  నెగటివ్ గా సూచించబడుతుంది.

WordPad తోల్లగింపుతో కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్ యూజర్లకు ఇతర అప్షన్స్ అందించింది. ప్రస్తుతం, కంపెనీ ఇతర అప్షన్స్  రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్‌ల కోసం MS Word లేదా ప్లెయిన్   డాక్యుమెంట్‌ల కోసం నోట్‌ప్యాడ్‌కి మారడం. 

click me!