రెడ్ మీ బడ్జెట్ ఫోన్‌ నుండి ఐఫోన్ 14 వరకు.. ఈ టాప్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ వారం లాంచ్ కాబోతున్నాయి..

By asianet news telugu  |  First Published Sep 5, 2022, 6:34 PM IST

మీలో చాలామంది దీపావళి సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే  కాస్త వేచి ఉండండి, ఎందుకంటే ఈ వారం షియోమీ కొత్త ఫోన్ రెడ్ మీ ఏ1 ఇండియాలో లాంచ్ కానుంది.


స్మార్ట్ ఫోన్ మార్కెట్ కి సెప్టెంబర్ నెల చాలా స్పెషల్ కానుంది. ఎందుకంటే ఈ వారం భారతీయ మార్కెట్లో కొత్త కొత్త ఫోన్‌లు లాంచ్ కానున్నాయి, అలాగే గత 8 నెలల లాంచ్ రికార్డును కూడా బద్దలు కొట్టవచ్చు. మీలో చాలామంది దీపావళి సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే  కాస్త వేచి ఉండండి, ఎందుకంటే ఈ వారం షియోమీ కొత్త ఫోన్ రెడ్ మీ ఏ1 ఇండియాలో లాంచ్ కానుంది, రెడ్ మీ ఏ1ని 7-8 వేల లేదా అంతకంటే తక్కువ ధరకు అందించవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వారంలో ఐఫోన్ 14 సిరీస్ కూడా లాంచ్ కానుంది, 14 సిరీస్ కింద మూడు ఫోన్‌లు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, మోటోరోల, పోకో, రెడ్ మీ, రియల్ మీ ఫోన్‌లు కూడా లాంచ్ కానున్నాయి...

ఐఫోన్ 14 సిరీస్
ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ సెప్టెంబర్ 7న జరగనుంది. ఈ సిరీస్ కింద ఐఫోన్ 14 , ఐఫోన్ 14 ప్లస్ / మ్యాక్స్, ఐఫోన్ 14  ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రొ  గురించి వార్త ఏంటంటే, ఈ రెండూ ఫోన్లు 6.1-అంగుళాల డిస్ ప్లే పొందుతాయి, అయితే ఐఫోన్ 14 మ్యాక్స్ / ప్లస్, ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 6.7-అంగుళాల స్క్రీన్‌తో అందించవచ్చు.

Latest Videos

undefined

పోకో ఎం5, పోకో ఎం5ఎస్ - సెప్టెంబర్ 5/6
పోకో ఎం5, పోకో ఎం5ఎస్ సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి, అయితే పోకో ఎం5 సెప్టెంబర్ 5న ఇండియాలో ప్రారంభించవచ్చు. ఈ ఫోన్ పోకో ఎం4 అప్‌గ్రేడ్ వెర్షన్. పోకో ఎం5 MediaTek Helio G99 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ పొందుతుంది, దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో లెదర్ టేక్శ్చర్ ఉంటుంది. ఇండియాలో పోకో M5 ధర రూ. 15,000లోపు ఉండవచ్చు.

రెడ్ మీ  11 ప్రైమ్ 5జి, రెడ్ మీ  11 ప్రైమ్- సెప్టెంబర్ 6
రెడ్ మీ  11 ప్రైమ్ 5జి, రెడ్ మీ  11 ప్రైమ్ 4జి లాంచ్ సెప్టెంబర్ 6న జరగబోతోంది. ఈ కొత్త ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన రెడ్ మీ  నోట్ 11ఈ రీ-బ్రాండెడ్ వెర్షన్. రెడ్ మీ ఏ1 కూడా ఈ రెండు ఫోన్‌లతో లాంచ్ కానుంది, దీనిలో అండ్రాయిడ్ గో వెర్షన్ ఇచ్చారు. దీని ధర సుమారు 7-8 వేలు ఉంటుందని చెబుతున్నారు.

రియల్ మీ సి33- సెప్టెంబర్ 6 
సెప్టెంబర్ 6న రియల్ మీ ఒక మెగా ఈవెంట్‌ నిర్వహించబోతోంది, ఇందులో రియల్ మీ వాచ్ 3 ప్రొతో పాటు కొత్త ఎంట్రీ లెవల్ ఫోన్ రియల్ మీ సి33 కూడా లాంచ్ చేయనుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ రియల్ మీ సి33లో చూడవచ్చు, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌, 5000mAh బ్యాటరీ ఫోన్‌తో లభిస్తుంది.  

మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజన్- సెప్టెంబర్ 8
ఇండియలో మోటో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంచ్ సెప్టెంబర్ 8న జరగబోతోంది. ఈ రెండు ఫోన్‌లు గతంలో చైనాలో లాంచ్ అయిన మోటో ఎక్స్30 ప్రొ, మోటో ఎస్30 ప్రొకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తుందని చెబుతున్నారు. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 200-మెగాపిక్సెల్ కెమెరాతో ఇండియాలో లాంచ్ చేసిన మొదటి ఫోన్.

click me!