jio best recharge plans: ఈ జియో ఉత్తమ ప్లాన్‌తో 100జి‌బి డేటా, ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్ కూడా ఫ్రీ..

Ashok Kumar   | Asianet News
Published : Feb 14, 2022, 06:42 PM IST
jio best recharge plans: ఈ జియో ఉత్తమ ప్లాన్‌తో 100జి‌బి డేటా,  ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్ కూడా  ఫ్రీ..

సారాంశం

జియో  ఉత్తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల గురించి మాట్లాడితే దీనిలో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి  ఐ‌టి‌టి ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌ను రూ. 599కే పొందుతారు. అంతేకాదు  100జి‌బి ఇంటర్నెట్, మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.   

రిలయన్స్ జియో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలలో ఒకటి. అయితే ప్రజలు జియో ఎక్కువగా ఇష్టపడటానికి కారణం దాని యూజర్ ఫ్రెండ్లీ ప్లాన్‌లు. వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో జియోకి బాగా తెలుసు, కాబట్టి తక్కువ ఖర్చుతో  ఎన్నో ప్రయోజనాలలు ఉన్న ప్లాన్‌లను  వినియోగదారులకు కంపెనీ అందిస్తుంది. జియోలో ప్రీపెయిడ్ అండ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి.

జియో  బెస్ట్ ప్లాన్ల గురించి మాట్లాడితే ఇందులో మీరు  నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్  (Amazon Prime) వంటి  ఓ‌టి‌టి ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 100జి‌బి ఇంటర్నెట్, మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు.  ఇందులో మొదట జియో రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ గురించి చూస్తే కస్టమర్‌లు డేటా, వాయిస్ కాలింగ్ నుండి ఓ‌టి‌టి సబ్‌స్క్రిప్షన్ వరకు ప్రయోజనాలను పొందుతారు. జియో  ఈ ప్లాన్ చాలా చవకైనది, ఈ ప్లాన్‌తో  ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి...


జియో  ఈ బెస్ట్ ప్లాన్ ఇప్పుడు కేవలం రూ.599కే అందుబాటులో ఉంది. ఈ రూ. 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కస్టమర్‌లు ఇతర ఓ‌టి‌టి ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. సాధారణంగా ఈ సబ్‌స్క్రిప్షన్ల కోసం మీరు చాలా డబ్బు చెల్లించాలి, కానీ ఈ ప్లాన్‌లో మీరు ఇవన్నీ ఉచితంగా పొందుతారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఒక సంవత్సరం సభ్యత్వం, నెట్‌ఫ్లిక్స్ అండ్ డిస్నీ + హాట్‌స్టార్  ఇంకా జియో యాప్‌ల సభ్యత్వంతో అందుబాటులో ఉంటాయి.

మరోవైపు ఇతర ప్రయోజనాల గురించి చెప్పాలంటే మీరు ఈ ప్లాన్‌తో ఏదైనా నెట్‌వర్క్‌కి ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ పొందుతారు. అందుకే ఈ ప్లాన్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనితో పాటు మీరు 100జి‌బి ఇంటర్నెట్‌తో ఈ ప్లాన్‌లో 200GB డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా కుటుంబ ప్లాన్‌తో పాటు మీకు అదనపు సిమ్ కార్డ్ కూడా అందిస్తుంది.
 

PREV
click me!

Recommended Stories

Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
Artificial Intelligence : చాట్ జిపిటి, జెమినిని అస్సలు అడగకూడని విషయాలివే... అడిగారో అంతే సంగతి..!